E-Paper
Advertisement

విశాఖలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. పోలీసులు కనిపించరు, చలాన్లు మాత్రం పడతాయ్, ఇదిగో ఇలా!

విశాఖలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. పోలీసులు కనిపించరు, చలాన్లు మాత్రం పడతాయ్, ఇదిగో ఇలా!
Advertisement

Visakhapatnam New Traffic Rules: రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వైజాగ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఎక్కడ చిన్న తప్పు చేసినా తప్పించుకోలేని సిచువేషన్ క్రియేట్ చేస్తున్నారు. స్పీడ్ గన్స్, ఏఐ టెక్నాలజీ సాయంతో రూల్స్ అతిక్రమించిన వెంటనే జరిమానా ఈ చలాన్ రూపంలో వాహనదారుడికి మొబైల్ కు వచ్చేలా ఏర్పాటు చేశారు వైజాగ్ ట్రాఫిక్ పోలీసులు.

స్పీడ్ లేజర్ గన్స్ సాయంతో..

వాహనదారుల అతి వేగాన్ని కంట్రోల్ చేసేందుకు2 స్పీడ్ లేజర్ గన్స్ ను వైజాగ్ ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 18 లక్షల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. ఈ స్పీడ్ గన్స్ 100 మీటర్ల దూరం నుంచే వచ్చే వాహనానికి సంబంధించి వేగాన్ని డికెక్ట్ చేస్తుంది. అదే సమయంలో వైజాగ్ లోని 44 కీలక ప్రాంతాల్లో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 24 గంటలు నిఘా పెడతారు. పోలీసులు కనిపించపోయినా, స్పీడ్ లేజర్ గన్స్, కెమెరాలు వాహనదారులను గమనిస్తూనే ఉంటాయి.

రూల్స్ అతిక్రమించగానే క్షణాల్లో మొబైల్ కు ఈ చలానా

Advertisement

ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి తప్పించుకోవడం వైజాగ్ లో సాధ్యం కాదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. స్పీడ్ లేజర్ గన్స్ సాయంతో 100 మీటర్ల దూరంలోనే స్పీడ్ డిటెక్షన్ చేయనున్నారు. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఖాయం కానుంది. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్‌ కు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. సీట్ బెల్ట్ లేకపోయినా క్షణాల్లో ఫైన్స్ విధించనున్నారు. నగర వ్యాప్తంగా 120 CCTV కెమెరాలతో 24/7 నిఘా ఉంచుతున్నారు.

Read Also: 8 ఏళ్ల వారెంటీతో.. జస్ట్ రూ. 49,999కే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!

ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న ట్రాఫిక్ పోలీసులు

Advertisement

ఇకపై వైజాగ్ లో ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తామంటే కుదరదని పోలీసులు వెల్లడించారు. కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్  పాటించడంతో పాటు సేఫ్‌గా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు. పోలీసులు కనిపించడం లేదంటూ ఉల్లంఘనలు చేయకూడదంటున్నారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందంటున్నారు. మొత్తంగా విశాఖలో మరికొద్ది రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్ అనేది ఉండదని పోలీసులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, పదే పదే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయడం, వాహనాలను జప్తు చేయడం, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: మిలటరీ తయారు చేసిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ఇది.. ఆఫ్ రోడ్‌లో రయ్ రయ్!

 

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×