E-Paper
Advertisement

Samantha Marriage: సమంత రెండో పెళ్లి… విలన్ అంటూ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

Samantha Marriage: సమంత రెండో పెళ్లి… విలన్ అంటూ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్
Advertisement

Samantha Marriage: సినీనటి సమంత (Samantha)దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) డిసెంబర్ ఒకటవ తేదీ బైర లింగవి ఆలయంలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఇలా వీరి వివాహం అది కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే సమంత తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ఎంతో మంది అభినందనలు చెప్పగా మరి కొంత మంది ఈమె పెళ్లి పై పరోక్షంగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదివరకు నటి పూనమ్ కౌర్ సమంత రెండో పెళ్లి పై వివాదాస్పద పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

విలన్ గా బాగా నటించింది..

తాజాగా సమంత ప్రాణ స్నేహితురాలు ఆమె పర్సనల్ మేకప్ స్టైలిష్ సాధన సింగ్(sadhna singh) సైతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ షేర్ చేస్తూ..” బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది”. అంటూ ఉన్న ఒక కొటేషన్ షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతకు ఎంతో ప్రాణ స్నేహితురాలు అయిన సాధన సమంతను విలన్ అంటూ మాట్లాడటం ఏంటి అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇలా సమంత గురించి సాధన ఈ విధమైనటువంటి పోస్ట్ చేయటమే కాకుండా తనని ఇంస్టాగ్రామ్ లో కూడా అన్ ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ట్రెండింగ్ లో నాగచైతన్య రెండో పెళ్లి ఫోటోలు..

Advertisement

ఇక సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేయగా తన స్నేహితురాలు ఇలాంటి పోస్ట్ చేయడం వెనుక గల కారణం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక సమంత రెండో పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో గతంలో నాగచైతన్యకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే నాగచైతన్య రెండో పెళ్లి ఫోటోలు కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇక సమంత రాజ్ గత కొద్దిరోజులుగా రిలేషన్ లో ఉన్నప్పటికీ వీరి రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వచ్చిన ఎక్కడ బయటపడలేదు.

ది ఫ్యామిలీ మెన్ 2..

Advertisement

ఇలా తమ రిలేషన్ గురించి అధికారక ప్రకటన వెల్లడించకుండానే ఈ జంట పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.. ఇక సమంత రాజ్ ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరికి ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ షూటింగ్ సమయంలోనే పరిచయం ఏర్పడింది. అప్పటికి ఇంకా సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోలేదు కానీ ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం సమంత రాజ్ మధ్య సానిహిత్యం పెరిగి ప్రేమగా మారడమే కాకుండా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ జంట పెళ్లి చేసుకోవడంతో వీరి అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Akhanda 2: అఖండ 2 ఏపీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే?

Related News

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

Big Stories

Advertisement
×