E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2 ఏపీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే?

Akhanda 2: అఖండ 2 ఏపీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే?
Advertisement

Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ఆఖండ 2 (Akhanda 2)సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. మొదటిసారి బాలకృష్ణ నటించిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాగా 4వ తేదీనే ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

పెరిగిన అఖండ 2 టికెట్ ధరలు ..

ఇటీవల కాలంలో సినిమా విడుదల అవుతుంది అంటే తప్పకుండా సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ 2 సినిమాకి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వాలు అనుమతి తెలిపినట్లు తెలుస్తోంది. మరి ఏ రాష్ట్రంలో ఏ విధంగా టికెట్ల రేట్లు పెరిగాయనే విషయానికి వస్తే.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు పెంచగా మల్టీప్లెక్స్ లో 100 రూపాయల టికెట్ ధరలను పెంచినట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు పెంచగా మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచినట్టు తెలుస్తుంది.పెంచిన టికెట్ ధరలకు సంబంధించిన జీవో త్వరలోనే విడుదల కానుంది.

ద్విపాత్రాభినయంలో బాలయ్య..

Advertisement

ఇకపోతే డిసెంబర్ 4వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న నేపథ్యంలో.. ప్రీమియర్ల టికెట్ ధరలు 600 రూపాయలు ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచడానికి అనుమతి తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా U/A సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రన్ టైం 2:45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలో ఆది పినిశెట్టి..

Advertisement

ఒక పాత్రలో ఎమ్మెల్యేగా కనిపించగా, మరొక పాత్రలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా బాలకృష్ణ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ఒక్క అప్డేట్ గూస్ బమ్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా థియేటర్లో చూస్తే బాలయ్య నటనకు తమన్ బీజేఎం తోడైతే పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, ఈ చిత్రాన్ని 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై గోపి అచంట రామ్ అచంట నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యతో పోటీ పడటం కోసం విలన్ పాత్రలో యువ హీరో ఆది పినిశెట్టి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. మరొక రెండు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Mowgli Trailer: ప్రేమ కోసం యుద్ధం చేసే ప్రతి ఒక్కడు హీరోనే… ఇంట్రెస్టింగ్ గా మోగ్లీ ట్రైలర్!

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×