Malaika Viral: మలైకా అరోరా …ఇప్పుడంటే వయసు మీద పడి అంతగా హడావిడి చెయ్యట్లేదు కాని లేట్ 90s లో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంటా కాదు. అలాంటి ఈ భామ రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్ కి వెళ్ళింది.అక్కడ డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజాతో కలిసి పిక్స్ దిగుతున్న టైమ్‌లో జరిగిన ఒక సరదా సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.
కంగారు పడిపోయిన పెద్దాయన
విషయం ఏంటంటే డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజాతో మలైకా నడిచి వస్తూ మీడియాకి ఫోజులు ఇస్తుంది.అయితే ఇదేమీ తెలీని ఒక పెద్దాయన అక్కడ ఏం జరుగుతుందో తెలీక కంగారు పడిపోయాడు. ముందు ఫోటో గ్రాఫర్స్ ని,వెనుక మలైకా ని చూస్తూ అసలు ముందుకు వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడి కన్ఫ్యూజ్ అయ్యాడు. అలా ఆలోచిస్తూనే ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు.ఇక ఇది చూసిన నెటిజన్లు అరె పాపం తాత మలైకా అందాల్ని చూసి ఎటు వైపు వెళ్ళాలో తెలీక తడబడిపోయాడు అని సరదాగా కామెంట్స్ పెట్టేస్తున్నారు కొందరు నెటిజన్లు.ఇక మరి కొందరైతే మలైకా మజాకా అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
ఇక కాస్త ముందుకు వచ్చాక డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజా మలైకాను మాత్రమే సోలోగా ఫోటోలు తీసుకోమని చెప్పగా మలైకా మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. “పర్లేదు నువ్వు కూడా ఫోటోలో ఉండాల్సిందే, కలిసి దిగుదాం” అని స్వీట్ స్మైల్‌తో పట్టుబట్టి మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది.
మలైకా విషయానికి వస్తే
ఇక మలైకా విషయానికి వస్తే ‘దిల్‌సే’ (1998) సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలిసి ‘ఛయ్య ఛయ్య’ పాటలో ఆమె వేసిన స్టెప్పులు ఏకంగా పాటకి నేషనల్ అవార్డ్ నే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత దబాంగ్ (2010)లో ‘మున్నీ బద్నామ్ హుయీ’ పాటైతే దేశాన్నే షేక్ చేసేసింది.
ఇక గబ్బర్ సింగ్ (2012) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘కెవ్వు కేక’ అంటూ టాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా పలకరించింది ఈ ఐటం బ్యూటీ. అయితే సినిమాల్లో ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా ఇండియాస్ గాట్ టాలెంట్, ఝలక్ దిఖ్లా జా, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి టాప్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.
ఇటు రెమో డిసౌజా విషయానికి వస్తే… ఏబీసీడీ (2013), ఏబీసీడీ 2 (2015), స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ (2020) వంటి సూపర్ హిట్ డ్యాన్స్ బేస్డ్ సినిమాలతో సత్తా చాటిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ తాజాగా ఈ వీడియోతో మరోసారి కల్సి వార్తల్లో హైలెట్ అయిపోయారు !