Dharmendra pradhan Vs Gautam Gambhir: దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. నిరుద్యోగులు అందరూ జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసనలకు దిగుతున్నారు. రెండు రోజులుగా పార్లమెంటు ముట్టడికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra pradhan ) రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, ఉద్యోగాల భర్తీలో వైఫల్యం, విద్యా సంస్కరణల అమలుకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ భారీ నిరసనకు తేరలేపింది. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా ఢిల్లీలో నిరసనలు జరుగుతున్నాయి.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కాక్రోచ్ జనతా పార్టీ విడిచి పెట్టేలా కనిపించడం లేదు. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ గొడవ కాస్త టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడ పైకి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కూడా రాజీనామా చేస్తే దేశానికి పట్టిన దరిద్రం పోతుందని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
ఢిల్లీలో నిరసనలకు దిగిన నిరుద్యోగులు.. పనిలో పనిగా గౌతమ్ గంభీర్ ఇంటి ముట్టడికి వెళ్లాలని టీమిండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీమిండియా ఓటమికి కారణమైన గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాడు ఎలాగూ రాజీనామా చేయడు… బీసీసీఐ తొలగించదు… అందుకే గంభీర్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వాలని… తమ బాధలు కూడా వినాలని సీజేపీ పార్టీకి క్రికెట్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు గౌతమ్ గంభీర్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరో, విలన్ కొట్టుకుని కమెడీయన్ ను కదరా! అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
గత నెల రోజుల వ్యవధిలోనే టీమిండియా రెండు టి20 సిరీస్ లను అలాగే ఓ వన్డే సిరీస్ కోల్పోయింది. దీని అంతటికి కారణం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. చెత్త నిర్ణయాలు తీసుకుంటూ… టీమిండియాను (Team India) భ్రష్టు పట్టిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను కావాలనే పక్కకు పెట్టి టీం ఇండియాను నాశనం చేశాడని ఫైర్ అవుతున్నారు. ఇప్పటి కైనా గౌతమ్ గంభీర్ పదవిని తొలగించి.. ధోనికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Two people under the most pressure right now.
Gautam Gambhir | Dharmendra Pradhan.
Who resigns first? pic.twitter.com/nduQeGqfPt
— Dixit Dave (@dixit_dave_) July 21, 2026