Upcoming Toyota Hilux 2026: భారత మార్కెట్లో లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కుల సెగ్మెంట్ లో టయోటా హిలక్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బలమైన నిర్మాణం, ఆఫ్ రోడ్ సామర్థ్యం, మంచి నమ్మకం కారణంగా ఈ వాహనం అడ్వెంచర్ ప్రేమికులకు ఫస్ట్ ఆప్షన్ గా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ పికప్‌కు కొత్త తరం అప్ డేట్ రాబోతోంది. జూలై 28న అధికారికంగా విడుదల కానున్న 9వ తరం హిలక్స్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా టయోటా విడుదల చేసింది.
టీజర్‌లో కనిపించిన దాని ప్రకారం కొత్త హిలక్స్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త స్టైల్ LED హెడ్ ల్యాంప్స్, మరింత ఆకట్టుకునే బంపర్ బోల్డ్ లుక్ ను తీసుకొచ్చాయి. పాత లోగో స్థానంలో గ్రిల్ మీద పెద్ద అక్షరాలతో TOYOTA పేరు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ డిజైన్ కు కంపెనీ సైబర్ సుమో స్టైల్ అనే పేరు పెట్టింది. సైడ్ ప్రొఫైల్ లో డ్యూయల్ క్యాబ్ డిజైన్ ను కొనసాగించినప్పటికీ కొత్త బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ రోల్ బార్లు దీనికి మరింత ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో కొత్త LED టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన టెయిల్ గేట్ కనిపిస్తున్నాయి. టీజర్ లో కొత్త ఎల్లో, ఆరెంజ్ కలర్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
ఇంటీరియర్‌లో కూడా టయోటా పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు హిలక్స్ క్యాబిన్ చాలా సింపుల్ గా ఉందనే విమర్శలు వచ్చేవి. ఈసారి వాటిని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కొత్త క్యాబిన్ ను రూపొందించింది. ప్రీమియం స్టీరింగ్ వీల్ తో పాటు 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించనుంది. అలాగే 12.3 అంగుళాల పెద్ద ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. ఇది టయోటా తాజా సాఫ్ట్ వేర్ తో పని చేయనుంది. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెదరెట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఇంజిన్ లో టయోటా పెద్ద మార్పులు చేయలేదు. ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న 2.8 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌నే కొనసాగిస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 200 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్‌లో 420 Nm టార్క్, ఆటోమేటిక్ వేరియంట్‌లో 500 Nm వరకు టార్క్ అందిస్తుంది. హ్యాండ్లింగ్‌ను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, మల్టీ టెర్రైన్ సెలెక్ట్ లాంటి వ్యవస్థలను యాడ్ చేయనున్నారు. కొన్ని హైఎండ్ వేరియంట్లలో కొత్త సస్పెన్షన్ సెటప్ కూడా అందించే అవకాశం ఉంది. దీంతో రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.
ఇక భద్రత విషయంలో కూడా టయోటా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. లెవెల్ 2 ADAS టెక్నాలజీ, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360 డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్ బ్యాగ్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించింది. జూలై 28న జరిగే అధికారిక లాంచ్‌తో ధర, వేరియంట్లతో పాటు పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Read Also: లాంచ్‌కు ముందే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సీక్రెట్స్ లీక్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!