The RajaSaab:మాళవిక మోహనన్ (Malavika mohanan).. సెలబ్రిటీ కిడ్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మలయాళంలో వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంది. అలాంటి ఈమె తొలిసారి కోటి ఆశలతో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ కెరియర్ లోనే తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ముందుకు వచ్చింది.
కానీ డిజాస్టర్ గా నిలిచింది.. అటు నిర్మాతలకు కూడా నష్టం వాటిల్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోగా విమర్శలు ఎదుర్కొంది. ప్రభాస్ ను చాలా సన్నివేశాలలో డూప్ ఉపయోగించారనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. ఇప్పుడు జియో హాట్ స్టార్ ఓటీటీ వేదికగా.. స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ఓటీటీలో చూసిన ఆడియన్స్ హీరోనే కాదు హీరోయిన్ కి కూడా డూప్ వాడారా? అంటూ కామెంట్లు చేయగా.. దీనికి తోడు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన రాన్సన్ విన్సెంట్ కూడా మాళవికతో ఉన్న ఫైట్ సీను కి సంబంధించి డూప్ ని పెట్టి చేసినట్లు ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేశారు. అమ్మాయికి అమ్మాయిని డూప్ గా పెట్టకుండా.. అబ్బాయిని డూప్ గా పెట్టి భలే మ్యానేజ్ చేశారని విమర్శలు కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు సడన్గా మాళవిక మోహనన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొంపదీసి ది రాజా సాబ్ దెబ్బతో నటనపై విరక్తి పుట్టి ఇండస్ట్రీకి దూరం కాబోతోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. విషయంలోకి వెళ్తే.. ఈమధ్యకాలంలో అటు హీరోలు ఇటు హీరోయిన్లు ఒకవైపు వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే.. మరొకవైపు తమ అభిరుచులను చాటుకుంటూ ఉంటారు. అలా మాళవిక మోహనన్ కూడా వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారింది.
ALSO READ:Dhurandhar OTT Records: విధ్వంసం సృష్టిస్తున్న ధురంధర్.. ఓటీటీలోనూ తగ్గని హవా!
అటు పులిని ఇటు చిన్న చిన్న జంతువులను ఫోటోలు తీసి వాటిని ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇకపోతే మాళవిక మోహనన్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారడంతో తన అభిరుచిని చాటుకోవడం చూసి అభిమానులు ప్రముఖ హీరోయిన్ సదా (Sada ) దారిలోనే ఈమె కూడా వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారనుందా అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మాళవిక మోహనన్ తన ఫ్యాషన్ ను ఫోటోలు రూపంలో బంధించి షేర్ చేయడంతో ఇప్పుడు కొంతమంది పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇంకా మాళవిక మోహనన్ హృదయపూర్వం సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది..