E-Paper
Advertisement

Dhurandhar OTT Records: విధ్వంసం సృష్టిస్తున్న ధురంధర్.. ఓటీటీలోనూ తగ్గని హవా!

Dhurandhar OTT Records: విధ్వంసం సృష్టిస్తున్న ధురంధర్.. ఓటీటీలోనూ తగ్గని హవా!
Advertisement

Dhurandhar OTT Records:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ (AdityaDhar)దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా.. ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ధురంధర్. 2025 డిసెంబర్ 5న ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ముఖ్యంగా వరుస కలెక్షన్లతో సునామీ క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై దాదాపు 50 రోజులు దాటినా ఇంకా అక్కడక్కడ థియేటర్లలో ప్రదర్శించబడుతూ ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. పైగా రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. అలాంటి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీ లో సంచలనం..

జనవరి 30వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు కళ్ళు చెదిరే రీతిలో వ్యూస్ రాబడుతోంది. కేవలం 10 రోజుల్లోనే అంటే జనవరి 30 నుండి ఫిబ్రవరి 8 వరకు సుమారుగా 16 లక్షల వ్యూస్ సాధించి సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అటు ఇండియాతో పాటు మరో పదకొండు దేశాలలో ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.పైగా థియేటర్లలోనే కాకుండా ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ చిత్రం తన పట్టును నిరూపించుకుంటూ దూసుకుపోవడం నిజంగా సంచలనం అనే చెప్పాలి. ఒక సినిమాకి ఈ రేంజ్ ఆదరణ చూసి అటు సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సీక్వెల్ కి సర్వం సిద్ధం..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమాకు కొనసాగింపుగా దురంధర్ 2: ది రివేంజ్ పేరిట సీక్వెల్ ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 19వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. పైగా ఈ సినిమా నుండి ఇటీవల టీజర్ విడుదల చేయగా అది కూడా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో దర్శకుడు ఆదిత్య తన భార్య ప్రముఖ హీరోయిన్ అయిన యామి గౌతమ్ (Yami Gautam) కు అవకాశం కల్పించారు. దాదాపు పది నిమిషాల పాటు సాగే ఆ సన్నివేశంతో ఆమె ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవడం ఖాయమని, ఆమె పాత్ర సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. ఆదిత్యధర్ పర్ఫెక్షన్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు.

ALSO READ:Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్గా తొలి అవకాశం ఆమెకే?

ఆర్ఆర్ఆర్ రికార్డును చెరపనుందా?

Advertisement

ఇకపోతే రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్.ఆర్.ఆర్ నెలకొల్పిన 43 మిలియన్ వ్యూస్ రికార్డును ఈ సినిమా అతి త్వరలోనే అధిగమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా మొదటి భాగం సాధిస్తున్న ఈ అద్భుతమైన స్పందనతో చిత్ర బృందం సీక్వెల్ పై మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×