E-Paper
Advertisement

Mollywood Industry : మలయాళ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటుడు సూసైడ్..

Mollywood Industry : మలయాళ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటుడు సూసైడ్..
Advertisement

Mollywood Industry : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికే ఎంతోమంది చిన్న కారణాలతో ప్రాణాలను తీసుకున్నారు. తాజాగా మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన యువ నటుడు అఖిల్ విశ్వనాధ్ సూసైడ్ చేసుకున్నాడని ఇండస్ట్రీలో టాక్.. ఈయన చోళ చిత్రంలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. అంతేకాదు కేరళ ఇండస్ట్రీలో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి నటుడు ఈనెల 11వ తేదీన తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు.. ఆయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.. మలయాళ ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయారు. ప్రస్తుత ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. సూసైడ్ చేసుకొని చనిపోవడానికి బలమైన కారణాలేంటని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అఖిల్ విశ్వనాథ్ ఆత్మహత్య..

అఖిల్ విశ్వనాధ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.. తన నటనకు అవార్డులు కూడా అందుకున్నాడు. అలాంటి ఈ నటుడు సూసైడ్ చేసుకొని చనిపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 11 న తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అఖిల్‌ తన ఇంట్లోనే మృతి చెంది కనిపించాడు.. ఈ సూసైడ్ పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ఇతని మరణ వార్త ను విన్న సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది..

Advertisement

Also Read :ఓటీటీలోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?

అఖిల్ పర్సనల్ విషయానికొస్తే.. 

నటుడు అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. తన సోదరుడు అరుణ్‌తో కలిసి ‘మాంగాండి’ అనే టెలిఫిలింలో నటించాడు.. ఆ సినిమాలు తన నటనతో మెప్పించాడు. దానికి గాను కేరళ ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందించింది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. సినిమాలు ఉన్నా కూడా ఏమైందో తెలియకుండా ఇంట్లో శవమై కనిపించాడు. ఇటీవలే అఖిల్ తండ్రి బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు.. ప్రస్తుతం అతను తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అతని తల్లి గీత కొడాలి వ్యాపారి ఎకోపన సమితి వ్యాపారభవన్‌లో ఉద్యోగిని.. అఖిల్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు మొబైల్ షాప్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు. అతను కొంతకాలంగా షాపుకు కూడా వెళ్లడం లేదని సమాచారం. ఇంతలో అతడి మృతి వార్త స్థానికంగా కలకలం రేపింది.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని అతను సూసైడ్ వెనకాల ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

 

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×