E-Paper
Advertisement

OTT Movie : అన్న హత్య తమ్ముడి వేట… బ్లడ్ బాయిల్ చేసే రివేంజ్… ట్రెండింగ్ లో కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : అన్న హత్య తమ్ముడి వేట… బ్లడ్ బాయిల్ చేసే రివేంజ్… ట్రెండింగ్ లో కొరియన్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie: ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొరియన్ యాక్షన్ రివెంజ్ సిరీస్ బ్లాక్‌ బస్టర్ హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్ టాప్-10లో వరుసగా 5 వారాలు ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు 2025లో అత్యధిక వ్యూస్ ఉన్న కొరియన్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది ఒక మాజీ గ్యాంగ్‌స్టర్ తన తమ్ముడి మర్డర్‌కు ప్రతీకారం తీర్చుకునే బ్లడీ జర్నీతో మొదలవుతుంది. సో జి-సబ్ 6 ఏళ్ల తర్వాత స్మాల్ స్క్రీన్‌కు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ సిరీస్ పేరు ఏమిటంటే

ఈ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘Mercy For None’. కిమ్ యోంగ్-వాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ 2025 నవంబర్ 21నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఐయండిబిలో 8.4/10 రేటింగ్ పొందింది. ఇందులో సో జి-సబ్, హా జూన్, హో జూన్-హో, నానా, లీ బ్యూమ్-సూ వంటి నటులు నటించారు. ఇది కొరియన్ ఒరిజినల్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ డబ్బింగ్ తో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : తెలుగులో ఇలాంటి సినిమానా ? మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమా

స్టోరీ ఏమిటంటే

నామ్ గి-జూన్ ఒకప్పుడు దేశంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్. జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక గతాన్ని వదిలి కొత్త జీవితం మొదలుపెట్టాడు. కానీ ఒక రోజు అతని ఏకైక తమ్ముడు హత్యకి గురవుతాడు. పోలీసులు హంతకుడిని పట్టుకోకుండానే కేసు క్లోజ్ చేసేస్తారు. కానీ గి-జూన్‌కు ఇది సాధారణ మర్డర్ కాదని అర్థమవుతుంది. ఇది తన పాత శత్రువులు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు కలిసి ప్లాన్ చేసిన కాన్స్‌పిరసీ అని గ్రహిస్తాడు. ఇక గి-జూన్ తనలో నిద్రపోతున్న పాత గ్యాంగ్ స్టర్ రూపాన్ని మళ్లీ తీసుకొస్తాడు. ఒక్కొక్కరినీ ట్రాక్ చేసి, బ్రూటల్‌గా చంపుతూ ముందుకు సాగుతాడు. ఈ సిరీస్ పూర్తిగా రివెంజ్ ట్రాక్‌లో నడుస్తుంది. కానీ ఫ్లాష్‌బ్యాక్స్ ద్వారా గి-జూన్, అతని తమ్ముడి రిలేషన్, గ్యాంగ్‌వార్ పాలిటిక్స్ చూపిస్తారు. లాస్ట్ రెండు ఎపిసోడ్స్‌లో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. కిల్లర్ ఎవరు ? ఎందుకు చంపారో అసలు రహస్యం బయటపడుతుంది. ఫైనల్ ఎపిసోడ్ బ్లడ్ బాత్‌తో ఎండ్ అవుతుంది.

Advertisement

 

 

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×