Raju weds Rambai OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఆ స్టార్ హీరోల సినిమాలు కన్నా చిన్న స్టోరీ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. ఇటీవల వచ్చిన చిన్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి.. అలాంటి హిట్ సినిమాలలో రాజు వెడ్స్ రాంబాయి ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న స్టోరీ లైన్ తో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ను అందుకుంది. పరువు హత్య కోణంలో డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ విలేజ్ లవ్ స్టోరీ థియేటర్లలో ఆడియన్స్ మనసును హత్తుకుంది.. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుంది..? స్ట్రీమింగ్ ఎక్కడ అన్నది ఒకసారి చూసేద్దాం..
తెలుగులో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి.. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ క్రమంగా కలెక్షన్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ సాంగ్ తెగ వైరల్ అవుతోంది.. సాయిలు కంభంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అఖిల్ రాజ్, తేజస్వి రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు నటించారు.. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది… ఈనెల 18న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది.
Also Read : మలయాళ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటుడు సూసైడ్..
రాంబాయి కూడా రాజును ఇష్టపడుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న తన కూతురికి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి తోనే పెళ్లి చేయాలని అనుకుంటాడు. కానీ కూతురు ప్రేమను అస్సలు ఒప్పుకోడు.. రాంబాయిని పెళ్లి చేసుకోవాలనే రాజు.. ముందే ప్రెగ్నెంట్ చేస్తే చచ్చినట్లు పెళ్లి చేస్తారనుకుంటాడు. రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత నిజంగానే వీరిద్దరూ ఒక్కటవుతారా? వెంకన్న చివరికి వీళ్ళ ప్రేమను ఒప్పుకుంటాడా..? ఈ క్యూట్ స్టోరీ కి ఆ గ్రామం తోడు ఉంటుందా..? గ్రామంలోని లవ్ స్టోరీ లకు ఎండింగ్ ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా స్టోరీ.. థియేటర్లలో ఈ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. ఇకపోతే ఈ వీక్ ఓటీటీలోకి బోలేడు సినిమాలు స్ట్రీమింగ్ రాబోతున్నాయి..ఆ పోటీని తట్టుకొని ఈ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..