E-Paper
Advertisement

Soubin Shahir: టాలీవుడ్ లోకి శౌబిన్ ఎంట్రీ ఇస్తున్నాడా..?

Soubin Shahir: టాలీవుడ్ లోకి శౌబిన్ ఎంట్రీ ఇస్తున్నాడా..?
Advertisement

Soubin Shahir: మలయాళం లోని కొందరు ప్రముఖులు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమంది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మరో స్టార్ నటుడు మలయాళం నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన మరెవరో కాదు గతంలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నిర్మాత నటుడు శౌబిన్ షాహిర్.. ఈయన ‘ ప్రేమమ్`,`కుంబలంగి నైట్స్`,`మంజుమ్మల్ బాయ్స్`,`కూలీ` వంటి చిత్రాలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈయన ఏ హీరో సినిమాలో నటించబోతున్నాడు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

తెలుగులోకి మలయాళ నటుడు ఎంట్రీ..

శౌబిన్.. మలయాళం లో నిర్మాతగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈయన ఇటీవలే కూలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మౌనిక పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.. అయితే ఇప్పటివరకు ఈ నా నేరుగా తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు తెలుగు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ బిగ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఈయన ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్.. కేవలం ఒక చిన్న పాత్రలో మాత్రమే కాదు.. ఇతని పాత్ర ఆ సినిమాకి కీలక మలుపుగా మారుతుందని డైరెక్టర్ సంకల్ప ఇటీవల ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఈ డైరెక్టర్ పాత్రలో బలాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అతడి సినిమాల్లో ఎంపికయ్యే నటులు కూడా యూనిక్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని తీసుకొని సినిమాను తెరకెక్కిస్తుంటారు. అందుకే ఈయన సినిమాలు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తాయి..

Advertisement

Also Read :రోహిణికి టెన్షన్.. గ్రాండ్ గా ఫంక్షన్.. మనోజ్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్..

గోపీచంద్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడంటే..? 

గోపీచంద్ ఎప్పుడు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంటాడు.. అదేవిధంగా మరోసారి యాక్షన్ లుక్ లో కనిపిస్తాడా? లేదంటే వేరే ఏదైనా కొత్తగా డైరెక్టర్ అతని చూపిస్తాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు ఈ వార్త తెలిసినప్పటి నుంచి గోపీచంద్ కన్నా అతను ఎక్కువ హైలైట్ అవుతున్నాడు. మలయాళం లో మంచి క్రేజ్ ఉన్న నటుడిని డైరెక్టర్ తెలుగులోకి తీసుకురాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే నాలుగైదేళ్ల కాలంగా మలయాళ నటులకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. ఫహద్ ఫాజిల్, దుల్కర్ సల్మాన్ వంటి నటులు తెలుగులో సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ మలయాళ నటుడికి ఈ మూవీ ఎలాంటి గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి.. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×