Jailer2 : తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్.. ఈ మూవీతో రజినీ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ సినిమాలో ‘వర్మన్’ పాత్రతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మలయాళ నటుడు వినాయకన్ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. గతంలో యాక్టర్ ఎన్ని సినిమాలు నటించిన సరే ఈ సినిమా అతనికి మంచి క్రేజ్ ని అందించింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా నటుడు వినాయకన్ వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు. గతంలో అనేకసార్లు ఆయనపై వివాదాల కారణంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.. మొన్నటికి మొన్న తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై పోలీస్ కేసు నమోదయింది.. ఇక అతని వివాదాలను పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా జైలర్ 2 లో కూడా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ జైలర్లో విలన్ పాత్రలో నటించాడు వినాయక న్.. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో అతను నటనపై ప్రశంసలు దక్కాయి. అయితే జైలర్ కు సీక్వెల్ గా రాబోతున్న జైలర్ 2 లో కూడా ఈయన నటిస్తున్నాడా లేదా అన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారాయి. తాజాగా ఈ వార్తలు పై నటుడు వినాయకన్ స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆయన ఏమన్నారంటే.. జైలర్ 2 గురించి అందరూ నన్ను అడుగుతూనే ఉంటారు.. అవును, నేను సినిమాలో భాగమే.. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అని చెప్పలేను, అయితే సినిమాలో నన్ను చూస్తారు.. ఇది నాకు ఇష్టమైన పాత్ర.. దర్శకుడు నెల్సన్ ఈసారి పెద్ద హిట్ కొట్టబోతున్నట్లు కనిపిస్తోంది..ఆయన అంటున్నారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : అమ్మాయి పై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం.. పోలీస్ కేసు నమోదు..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా జైలర్ 2.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇకపోతే ఈ మూవీ పై హైప్ ను పెంచడానికి మూవీ టీమ్ స్టార్ హీరోలతో గెస్ట్ రోల్స్ చేయిస్తున్నారు. ఈక్రమంలో బాలయ్య బాబును కూడా అడిగినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇందులో ఒక హిందీ సూపర్ స్టార్‌ను కూడా తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నట్లు టాక్.. దానికోసం షారుఖ్ ఖాన్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విలన్ గా వినాయకన్ కూడా ఎంట్రీ ఇస్తున్నారని తెలియడంతో.. రజిని అభిమానులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన జైలర్ తో పోలిస్తే ఇప్పుడు సీక్వెల్ గా రాబోతున్న సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.