E-Paper
Advertisement

Ex Love Photos: మీ మాజీ లవర్ ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి డిలీట్ చేయాల్సిందే, అదే మీకు ఆరోగ్యం

Ex Love Photos: మీ మాజీ లవర్ ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి డిలీట్ చేయాల్సిందే, అదే మీకు ఆరోగ్యం
Advertisement

సమాజంలో ప్రేమ సంబంధాలు సాధారణమే. కానీ ఏదో కారణంగా ఆ ఈ సంబంధం ముగిసినప్పుడు మనసులో ఉండే జ్ఞాపకాలు చాలా కాలం వెంటాడుతుంటాయి. ముఖ్యంగా ఫోన్‌లో ఉండే ఎక్స్‌ ఫోటోలు మనలో పాత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తుకు తెస్తూ మనసుకు బాధ కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో నిపుణులు చెబుతున్న సూచనల ప్రకారం ఎక్స్‌ ఫోటోలను డిలీట్‌ చేయడం మన మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాజీ లవర్ ఫోటోలు, వీడియోలు పదే పదే చూడడం వల్ల మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

మనసుపై ఒత్తిడిని పెంచుతాయి
సంబంధం ముగిసిన తర్వాత కూడా ఫోన్‌లో ఆ వ్యక్తితో తీసుకున్న ఫోటోలు కనిపించడం మనసుకు భారంగా మారుతుంది. ఫోటో ఒక్కటి చూసినా ఆ వ్యక్తితో గడిపిన క్షణాలు, జరిగిపోయిన సంఘటనలు, విడిపోవడానికి కారణాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ముందుకు వెళ్లే మనసును అడ్డుకుంటుంది.

Advertisement

బ్రేకప్ తర్వాత మనసు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఎక్స్‌ ఫోటోలు ఫోన్‌లో ఉండడం వల్ల మనసు పూర్తిగా హీలింగ్‌ అవ్వదు. అవి కనిపించే ప్రతిసారీ పాత గాయాల నుంచి మళ్లీ రక్తం కారినట్లవుతాయి. అందుకే ఫోటోలను డిలీట్‌ చేయడం ద్వారా మనసుకు ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది అనే సందేశం వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది హీలింగ్‌ స్పీడ్‌ను పెంచుతుంది.

గత జ్ఞాపకాలతో మనసును నింపేసుకుంటే, కొత్త వ్యక్తులు, కొత్త అనుభవాలను స్వీకరించే అవకాశాలు తగ్గిపోతాయి. మాజీ లవర్‌ ఫోటోలు మనసులో ఒక గోడ లాంటి భావనను సృష్టిస్తాయి. అవి డిలీట్‌ చేస్తే మనసు తేలిక కావడంతో పాటు, కొత్త సంబంధాలకు, కొత్త ఆలోచనలకు స్థలం ఏర్పడుతుంది. పాత సంబంధం ముగిసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఫోటోలు ఫోన్‌లో ఉంచుకోవడం చాలా మంది అలవాటుగా చేస్తారు. కానీ ఇది కొంతవరకు మన స్వాభిమానానికి కూడా నష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డిలీట్‌ చేయడం ద్వారా మన మానసిక ప్రశాంతతను ముందుకు పెడుతున్నామని, మనను మనం విలువైనవారమని గుర్తుచేసుకునే అవకాశం లభిస్తుంది.

Advertisement

ఫోన్‌లో ఉన్న అనవసర ఫోటోలు, జ్ఞాపకాలు మనసును ఇబ్బంది పెడతాయి. మాజీ లవర్‌ ఫోటోలు తొలగించడం ద్వారా ఫోన్‌ మాత్రమే కాదు, మనసు కూడా కొంతవరకు శుభ్రపడుతుంది. రోజూ ఫోన్‌ స్క్రోల్‌ చేస్తున్నప్పుడు అవి యాదృచ్ఛికంగా కనిపించవు. అయితే ప్రతి ఒక్కరి భావాలు, అనుభవాలు వేర్వేరు. కొంతమంది కోసం ఆ ఫోటోలు భాధగా కాకుండా గత జ్ఞాపకాల ప్రతీకగా ఉండొచ్చు. వాళ్లు వాటిని డిలీట్‌ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ సంబంధం ముగిసిన తర్వాత మానసిక ఒత్తిడి, బాధ ఎక్కువగా ఉంటే, ఫోటోలను డిలీట్‌ చేయడం నిజంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

SIR తర్వాత ఓటర్ లిస్ట్‌లో మీ పేరు కనిపించడం లేదా? మళ్లీ నమోదు చేసుకోవడానికి ఇలా చేయండి

వెన్నునొప్పి, మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఫిజియోథెరపీ అవసరం

దేవుడిపై బలమైన నమ్మకం.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ

బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి

ఈ విధానంలో భోజనం చేస్తే షుగర్ ఎప్పుడూ పెరగదు.. మధుమేహులకు డాక్టర్ చెప్పిన సింపుల్ చిట్కా

పేరు లేని బంధం.. బ్రేకప్ కూడా కాదు.. అయినా సిచ్యుయేషన్‌షిప్ ఎందుకింత బాధిస్తుంది?

దాని ‘సైజ్’ పెంచుకోడానికి ఇన్‌ఫ్లుయెన్సర్ అత్యాశ.. సర్జరీ సక్సెస్, కానీ..

ఎప్పుడు క్షమాపణ అడగాలి? ఎప్పుడు సంబంధాన్ని తెంచుకోవాలి?.. సంతోషకర జీవితానికి చాణక్యుడి సూచనలు

Big Stories

Advertisement
×