E-Paper
Advertisement

Anaswara rajan: ఆ అవమానం మర్చిపోలేను.. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చేశాను..

Anaswara rajan: ఆ అవమానం మర్చిపోలేను.. ఒంటరిగా ఎన్నోసార్లు ఏడ్చేశాను..
Advertisement

Anaswara rajan: మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య ఏ సినిమా వచ్చినా కూడా ఈమె హీరోయిన్గా కనిపిస్తుంది. హీరోయిన్ల ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు పాతిక సినిమాలకు పైగా చేసి మలయాళ ప్రేక్షకుల హృదయాల్లో జరిగిన ముద్ర వేసుకుంది.. ఈమె ఒక్క సినిమాతో తన టాలెంట్ ని పెంచుకుంటూ యూత్ క్రష్ గా మారిపోయింది. మాలీవుడ్ లో సక్సెస్ హీరోయిన్ గా మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది.. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న “ఛాంపియన్” సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

ఈ చిత్రం ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన జీవితంలో జరిగిన కొన్ని మర్చిపోలేని సంఘటనల గురించి అందరితో పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడు జరిగిన అవమానమే తనని ఇంత పెద్ద స్టార్ని చేసిందని ఆమె చెప్పింది. ఆ హీరోయిన్ కి చిన్నప్పుడు జరిగిన చేదు అనుభవం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

స్కూల్లో భరించలేని భాదను అనుభవించాను…

Advertisement

అనశ్వర రాజన్‌ మలయాళ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించి బాల నటిగా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.. లో బడ్జెట్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌గా ఎదిగింది.. ప్రస్తుతం మలయాళంలో ఈమె చేస్తున్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. ప్రస్తుతం ఛాంపియన్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె స్కూల్ డేస్ లో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నన్ను స్కూల్లో ఎవరు పలకరించేవారు కాదు. టీచర్లే నాతో మాట్లాడొద్దని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పించేవాళ్లు. క్లాసులో మార్కులు కాస్త తక్కువగా వస్తే సినిమాలు చేసుకోవచ్చు బాధపడకు అని హేళన చేసేవారు. నన్ను ఎంతగా అవమానించారో నేను ఈ స్థాయిలో నిలబడేలా చేసింది కూడా వాళ్లే అని ఆమె తన భాదను బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది..

Also Read : మహా రెడ్ కలర్ ప్లాన్ సక్సెస్.. భూషణ్ ఒప్పుకుంటాడా..? నిజం తెలుసుకున్న చక్రి..

‘ఛాంపియన్’ మూవీలో నా పాత్ర ఇదే..

Advertisement

ఛాంపియన్ మూవీలో నేను తాళ్లపూడి చంద్రకళగా నటించాను. అచ్చమైన తెలుగమ్మాయిగా, హైపర్‌ యాక్టివ్‌గా ఉంటాను. నన్ను ఒక రౌడీలాగా చూస్తారేమో అని ఆమె అన్నది. సెట్ లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను.. రియల్‌ లైఫ్‌లో మాత్రం నేను చాలా కూల్‌గా ఉంటాను. మొదట్లో తెలుగు కాస్త కష్టంగా అనిపించినా.. ఆ తర్వాత కొంచెం అర్థం తెలియడంతో తెలుగు పై ప్రేమ మొదలైంది అని హీరోయిన్ అంటున్నారు. అంతేకాదు ‘గిర గిరా’ పాట విడుదలైన కొద్దిసేపటికే నా ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ల తో నిండిపోయింది.. నాపై తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న అభిమానానికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుతాను అని అనశ్వర రాజన్‌ అన్నారు. ప్రస్తుతం ఆమె స్కూల్ డేస్ గురించి చెప్పిన నిజాలు అందరిని ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

 

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×