E-Paper
Advertisement

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!
Advertisement

Malvi Malhotra:నటి మాల్వి మల్హోత్రా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘డెనిమ్ స్టేట్ ఆఫ్ మైండ్’ ఫొటోషూట్ తెగ వైరల్ అవుతుంది. బ్లూ డెనిమ్ జాకెట్, వైడ్ లెగ్ జీన్స్, లోపల బ్లాక్ టాప్ ధరించి సోఫాపై ఇచ్చిన పోజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. పెద్దగా ఫ్యాన్సీ సెటప్ లేకుండా మినిమల్ లుక్‌లోనే స్టైలిష్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను క్రియేట్ చేయవచ్చని మరోసారి ప్రూవ్ చేసింది ఈ బాంబే బ్యూటీ.

ఓ పర్ఫెక్ట్ ఫిల్మ్ స్టిల్

సాధారణంగా డెనిమ్ అంటేనే  క్యాజువల్ లుక్ అనే ఫీల్ ఉంటుంది. కానీ మాల్వి మాత్రం అదే డెనిమ్‌ను అత్యంత స్టైలిష్‌గా మార్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. సింపుల్ హెయిర్ స్టైల్, తక్కువ మేకప్‌తో తన నాచురల్ బ్యూటీతో మరింత హైలైట్ అయింది. ఫొటోల్లోని బ్యాక్‌డ్రాప్ నుంచి డ్రెస్సింగ్ వరకు ఒకే టోన్ మెయిన్టెయిన్ చేయడం ఇక్కడ హైలెట్.అందుకే ఈ ఫొటోలు చూసిన వారంతా కేవలం ఫ్యాషన్ పోస్ట్ అనకుండా ఓ పర్ఫెక్ట్ ఫిల్మ్ స్టిల్ లాగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

హిందీ టీవీలోని ‘ఉడాన్’ సీరియల్‌తో నటిగా 

Advertisement

ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే, మాల్వి జర్నీ ఒక్క భాషకే పరిమితం కాలేదు. హిందీ టీవీలోని ‘ఉడాన్’ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘హోటల్ మిలన్’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టారు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి వరుసగా వివిధ భాషల్లో ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. మలయాళంలో ‘అభ్యూహం’, తెలుగులో రాజ్ తరుణ్ సరసన ‘తిరగబడరా సామీ’, తమిళంలో ‘జన్మ నక్షత్రం’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు మాల్వీ . కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్, యాక్షన్ లేదా థ్రిల్లర్ జోనర్ చిత్రాలను ఇష్టపడుతుందని చేస్తున్న సినిమాలని చూస్తేనే అర్థమవుతుంది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్‌

అలా మల్టీ-లాంగ్వేజ్ ప్రాజెక్టులతో తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్న మాల్వి, మరోవైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉండటం విశేషం.అలా సినిమా అప్డేట్లతో పాటు ఈ తరహా ట్రెండీ ఫొటోషూట్లతో తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటు. గ్లామర్, యాక్టింగ్ టాలెంట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

Tags

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×