E-Paper
Advertisement

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!
Advertisement

Revanth Reddy: ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్ళాలని అన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నెహ్రూ ముందు చూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుందని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీదని గుర్తు చేశారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ తెలిపారు.

రైతులపై కేసులు..

అగ్రికల్చర్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరాగాంధీ గాందిదని, పీడీఎస్ విధానం తీసుకో తీసుకొచ్చి రేషన్ షేప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ సొంతం అని అన్నారు. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సాంబ బియ్యం అందిస్తున్నామంటే అనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల కృషినే కారణం. రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ అని అన్నారు. ఆనాడు 1300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్ రారాజుగా నిలిచారని అన్నారు. తెలంగాణలో సాగు నీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్ దని గుర్తుచేశారు.

Advertisement

Also read: యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

వైఎస్ చివరి కోరిక..

ఆనాడు వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్ బీసీ ఇప్పుడు ఆగిపోయాయి. వారి ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తాం ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్ బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ అభిమానులకు ఒక మాట గుర్తు చేస్తున్నా. వైఎస్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారుని అన్నారు. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలని, అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం అని సీఎం రేవంత్ కొనియాడారు.

రాహుల్ గాంధీ..

Advertisement

దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైస్ కు నిజమైన నివాళని, ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానినిచేయాలని అన్నారు. ఇందుకు మీ అందరి మద్దతు అవసరం. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మనమంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also read: వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

Tags

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×