E-Paper
Advertisement

Mammootty: ఈయన వల్లే మహమ్మద్ కుట్టి నుంచి మమ్ముట్టిగా మారా.. స్టేజ్‌పైనే అసలు నిజం చెప్పిన హీరో

Mammootty: ఈయన వల్లే మహమ్మద్ కుట్టి నుంచి మమ్ముట్టిగా మారా.. స్టేజ్‌పైనే అసలు నిజం చెప్పిన హీరో
Advertisement

Mammootty: మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మమ్ముట్టి(Mammootty)కి కేవలం మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగులో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ హీరో తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ అప్పటి విషయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మహమ్మద్ కుట్టి నుంచి మమ్ముట్టిగా..

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మమ్ముట్టి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నిజానికి తన పేరు మమ్ముట్టి కాదు అంటూ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు పేరు మహమ్మద్ కుట్టి అని (Mohammed Kutty)తెలిపారు.. మహమ్మద్ కుట్టి అయిన నాకు కాలేజీ రోజుల్లో మమ్ముట్టి అని పేరు పెట్టారని ఆ పేరు పెట్టింది మరెవరో కాదు నా స్నేహితుడు శశిధరన్(Shasidharan) అంటూ తన స్నేహితుడిని పరిచయం చేశారు. ఇలా తన స్నేహితుడు శశిధరన్ ను వేదిక పైకి పిలిచి శశిధరన్ తన పేరును ముందుగా మమ్ముట్టి అని పిలవడం ప్రారంభించడంతో అందరూ కూడా అలాగే పిలిచేవారు. ఇక తన స్నేహితుడు పెట్టిన పేరుతో తాను నటుడిగా స్థిరపడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

స్నేహితుడు పెట్టిన పేరుతో ఇండస్ట్రీలో సక్సెస్..

Advertisement

ఇలా వేదికపైనే తనకు పేరు పెట్టిన తన స్నేహితుడిని మమ్ముట్టి అందరికీ పరిచయం చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఈ విధంగానే సొంత పేరు ఒకటైతే ఇండస్ట్రీలో మరొక పేరుతో మంచి సక్సెస్ అందుకొని కొనసాగుతున్నారు. ఇక మమ్ముట్టి కూడా తన అసలు పేరుతో కాకుండా స్నేహితుడు పెట్టిన ముద్దు పేరుతో ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలు అందుకోవడమే కాకుండా స్టార్ హీరోగా మలయాళ చిత్ర పరిశ్రమలు పేరు పొందారు.

Advertisement

ఇక ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా సినిమాలు చేయడమే కాకుండా ఇతర సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన కూడా మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషలలో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.. తెలుగు ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈయన సినిమాలకు ఇక్కడ చాలా ఆదరణ లభిస్తుంది .ఇటీవల దుల్కర్ హీరోగా కాంత అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ ఖాన్ కాంత సినిమా ద్వారా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇక ఈయన నిర్మాతగా మారి ఇటీవల లోక అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్లో కూడా ముమ్మట్టి నటించబోతున్న విషయం తెలిసిందే.

Also Read: NTR -Prashanth Neel: ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్.. సెట్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×