E-Paper
Advertisement

Mana Shankar varaprasad Garu : చిరంజీవి, నయన్‌ల ‘శశిరేఖ’ సాంగ్.. ‘కాత్యాయనీ’ పాటకు కాపీలా ఉందే!

Mana Shankar varaprasad Garu : చిరంజీవి, నయన్‌ల ‘శశిరేఖ’ సాంగ్.. ‘కాత్యాయనీ’ పాటకు కాపీలా ఉందే!
Advertisement

Mana Shankar varaprasad Garu : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’… టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మీసాల పిల్ల పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. గతంలో చిరంజీవి సినిమాలోని పాటలకు ఎప్పుడు రానన్ని వ్యూస్ కూడా రావడంతో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది… ఇక ఈ మూవీ నుంచి మరో సాంగ్ రాబోతుంది.. ఆ సాంగ్ ప్రోమో ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సాంగ్ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

శశిరేఖా సాంగ్ ప్రోమో వచ్చేసింది..

డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు.. ఈ మూవీ నుంచి బయటకొచ్చిన చిరంజీవి లుక్ అదిరిపోయింది. ఆ తర్వాత సినిమాలు నుంచి మొదటి పాట ‘మీసాల పిల్ల…’ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను అందుకుంది. ఆ తర్వాత నయనతారను ‘శశిరేఖా…’ అంటూ పిలవతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో రెండో పాట ‘శశిరేఖ’లో హీరో హీరోయిన్స్ లుక్ ని రీవిల్ చేశారు.. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.. పడవ మీద పంచ కట్టులో కనిపిస్తాడు.. శశిరేఖ నీకు ఓ మాట చెప్పాలి ఫీలవమాకా అనే లిరిక్స్ తో సాంగ్ మొదలవుతుంది. మరో పడవపై నయనతార చీర కట్టులో అందంగా కనిపిస్తుంది.. మీసాల పిల్ల పాటతో పోలిస్తే ఈ పాట మరో రికార్డు ను బ్రేక్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంది.. అందమైన లొకేషన్స్ తో అదిరిపోయే లిరిక్స్ తో వచ్చిన ఈ పాట ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోమో ఎలా ఉందో మీరు ఓ లుక్కేసుకోండి…

Advertisement

Also Read: పెళ్ళైన ఐదు రోజులకే పని మొదలెట్టిన సమంత.. డెడికేషన్ కు హ్యాట్సాప్..!

‘శశిరేఖ’ సాంగ్.. ‘కాత్యాయనీ’ పాటకు కాపీనా..?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. మెగాస్టార్ నుంచి రాబోతున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, అలాగే మీసాల పిల్ల సాంగ్ జనాలని బాగా ఆకట్టుకుంది. ఆ సాంగ్ పై రీల్స్ కూడా రావడంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు రెండో పాట శశిరేఖ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమోలోని లొకేషన్, హీరో, హీరోయిన్ల లుక్ వరకు బాగానే ఉంది కానీ.. లిరిక్స్ దెబ్బేసేలా ఉన్నాయని టాక్.. ఆ పాట గతంలో వచ్చిన కాత్యాయని పాటలాగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ సాంగ్ ను కాపీ కొట్టారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ప్రోమో రిలీజ్ అవ్వగానే ట్రోల్స్ మొదలయ్యాయి. మరి సాంగ్ రిలీజ్ చేసే టైంలో ఏవైన మార్పులు చేస్తారేమో చూడాలి.. నెట్టింట కాపీ అంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందిస్తారేమో చూడాలి.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది..

Advertisement

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×