E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu: ప్రభాస్ లానే ప్లాన్ చేసిన చిరంజీవి.. ఏ విషయంలో అంటే..

Mana Shankara Vara Prasad Garu: ప్రభాస్ లానే ప్లాన్ చేసిన చిరంజీవి.. ఏ విషయంలో అంటే..
Advertisement

Mana Shankara Varaprasad Garu Release Date: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. అలాంటిది ఇప్పుడు కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తూ ఉండడం సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అనిల్ రావిపూడి అంటేనే ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్, క్లిన్ కామెడీ, ఫ్యామిలీ ఫన్. అనిల్ రావిపూడి ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి కొత్తగా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

సినిమా విడుదల విషయానికి వస్తే మన శంకర వరప్రసాద్‌గారు సినిమా ఈ ఏడాది సంక్రాంతికి, జనవరి 12న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ కూడా భారీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి జనవరి 9న ఇండియాలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్‌గారుకి జనవరి 11న పేడ్ ప్రివ్యూస్ ఉండొచ్చని టాక్.

మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ టికెట్ ధర ఎంతంటే..

Advertisement

అయితే టికెట్ రేట్ల విషయంలో కూడా తేడా ఉందట. ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ టికెట్ ధర రూ.800గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక చిరంజీవి సినిమా ప్రివ్యూస్‌కి రూ.500 టికెట్ రేట్ ఉండొచ్చని చెబుతున్నారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల పెయిడ్ ప్రీమియర్స్‌కి, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమల్లో ఉంటే ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

మన శంకర వరప్రసాద్‌గారు ఒక పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన మరొక అప్డేట్ ఫ్యాన్స్‌ను మరింత ఎక్సైట్ చేస్తోంది.

చిరంజీవి క్రేజీ ఇంట్రో సాంగ్ నెక్స్ట్ లెవెల్..

Advertisement

ఈ సినిమాలో చిరంజీవికి ఓ క్రేజీ ఇంట్రో సాంగ్ ఉంటుందని, అది సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే విడుదల చేస్తామని అనిల్ రావిపూడి స్పష్టంగా చెప్పారు. ఈ ఇంట్రో సాంగ్‌ను పూర్తిగా చిరంజీవి మాస్ ఇమేజ్‌ని సెలబ్రేట్ చేసేలా డిజైన్ చేశామని ఆయన చెప్పడం మరింత హైప్ పెంచుతోంది. మెగాస్టార్ స్క్రీన్ మీద అడుగు పెట్టగానే వచ్చే ఎనర్జీ, ఆయన స్టైల్, ఆ వింటేజ్ ఫీల్ అన్నీ ఈ పాటలో కనిపిస్తాయట. పాట రిలీజ్ అయితే ఫ్యాన్స్ థియేటర్లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా గోల చేస్తారని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

ALSO READ: Chiranjeevi vs Ram Charan: యూట్యూబ్ లో మీసాల పిల్లా హవా… పోటీ పడుతున్న తండ్రి కొడుకులు!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×