E-Paper
Advertisement

Mana Shankara Vara Prasad Garu: అమెరికాలో మెగాస్టార్ సినిమాకి ఇంత కష్టమా?

Mana Shankara Vara Prasad Garu: అమెరికాలో మెగాస్టార్ సినిమాకి ఇంత కష్టమా?
Advertisement

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా..అమెరికాలో మాత్రం కొంతమంది తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా మెగాస్టార్ సినిమా అంటే అమెరికాలో పెద్ద ఎత్తున స్క్రీన్లు, షోలు ఉంటాయి. కానీ ఈసారి చాలా నగరాల్లో ఈ సినిమా దగ్గర్లోని థియేటర్లలో అందుబాటులో లేదని అభిమానులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చాలా దూరం ప్రయాణం చేస్తేనే షో దొరుకుతోందని సోషల్ మీడియాలో ఫిర్యాదులు పెరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్..చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే తెలుగు కుటుంబాలు ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

పండుగ సమయంలో కుటుంబంతో కలిసి సినిమా చూడటం ఆనందంగా ఉండాలి. కానీ ఎక్కువ దూరం వెళ్లాల్సి రావడంతో వృద్ధులు, పిల్లలతో వచ్చే కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. దీని వల్ల పండుగ ఫీలింగ్ తగ్గిపోతోందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ట్రేడ్ వర్గాల మాట ప్రకారం.. సినిమాకు డీసెంట్ టాక్ ఉన్న నేపథ్యంలో అమెరికాలో మరిన్ని స్క్రీన్లు పెడితే కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉందని సమాచారం. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు స్పందించి అదనపు షోలు, స్క్రీన్లు పెడితే మంచిదని మెగా అభిమానులు కోరుతున్నారు.

Advertisement

మరోవైపు ప్రభాస్ రాజా సాబ్.. అమెరికాలో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆ సినిమాకు ఉన్న స్క్రీన్లను మన శంకర్ వరప్రసాద్ గారికి.. కేటాయించాలని అభిమానుల డిమాండ్. అలా చేస్తే ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కుతుందని వారు భావిస్తున్నారు.

దీంతో అమెరికాలో సరైన స్థాయిలో థియేటర్ అందుబాటు ఉంటే, ఈ సినిమా అక్కడ కూడా బలమైన రన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు త్వరగా స్పందిస్తారని మెగా అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

ALSO READ: Allu Aravind:  బాస్ ఈజ్ బాస్.. శంకర్ వరప్రసాద్ పై అల్లు అరవింద్ రివ్యూ..

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×