E-Paper
Advertisement

MSVPG Release: శంకర్ వరప్రసాద్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. చెప్పిన తేదీకి వస్తున్నారుగా!

MSVPG Release: శంకర్ వరప్రసాద్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. చెప్పిన తేదీకి వస్తున్నారుగా!
Advertisement

MSVPG Release: మెగాస్టార్ చిరంజీవి హీరోగా (Chiranjeevi)అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ గత కొద్ది రోజులగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు అనుగుణంగానే తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారకంగా ప్రకటించారు. అనుకున్న విధంగానే మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జనవరి 12న రాబోతున్న శంకర వరప్రసాద్ గారు..

ఇక ఈ సినిమా విడుదలకు పెద్దగా సమయం కూడా లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ఒక వైపు నిర్వహిస్తూనే మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాల నుంచి మొదలుకొని అనిల్ రావిపూడి తనదైన శైలిలోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన శశిరేఖ పాట కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక మీసాల పిల్ల సాంగ్ ఏకంగా మిలియన్ సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేడు చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా..

Advertisement

ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాని జనవరి 12 అంటే సోమవారం విడుదల చేయడం విశేషం. ఇక ఇప్పటినుంచి పెద్ద ఎత్తున అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను కూడా భారీగా నిర్వహించబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార(Nayanatara) నటించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలే ఉంటాయి.

Advertisement

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చివరిగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ పై కూడా మంచి అంచనాలు పెరిగిపోయాయి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో పాత్రలో నటించారు. దాదాపు ఈయన పాత్ర 20 నిమిషాల వరకు ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మాస్ సాంగ్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సైన్ స్క్రీన్, గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Big tv kissik Talks: జబర్దస్త్ నుంచి వెళ్ళలేదు.. వెళ్లగొట్టారు అసలు విషయం చెప్పిన ప్రియాంక!

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×