E-Paper
Advertisement

Manasa Varanasi: మిస్ ఇండియా విన్నర్‌కు డబ్బులు ఇవ్వరు.. ఆ సౌకర్యాలే ఉంటాయ్!

Manasa Varanasi: మిస్ ఇండియా విన్నర్‌కు డబ్బులు ఇవ్వరు.. ఆ సౌకర్యాలే ఉంటాయ్!
Advertisement

Manasa Varanasi: సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Frendly) సినిమాలో మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మానస వారణాసి యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరీ ముఖ్యంగా అందాల పోటీల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Prabhas: బాహుబలి సినిమా కన్నా ముందే ప్రభాస్ ఒక హిందీ సినిమా చేశారన్న విషయం తెలుసా..!

వేర్వేరు ప్రొఫెషన్స్‌లో బ్యూటీస్..

Advertisement

ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో కిరీటాన్ని అందుకున్న మానస వారణాసి.. మిస్ వరల్డ్ 2021 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే అందాల పోటీలలో పాల్గొంటే ప్రైజ్ మనీ ఏమీ ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘అందాల పోటీల్లో గెలిచిన వారంతా సినిమా ఇండస్ట్రీ రావాలని కోరుకోరు. ఎవరికి వారు వేర్వేరు ప్రొఫెషన్స్‌ను ఎంచుకున్న వాళ్లున్నారు. అందాల పోటీలకు సిద్ధమయ్యే టైమ్‌లో ఎక్కువగా కెమెరాలకు అలవాటు పడాల్సి ఉంటుంది. అలా, కొంతమంది సినిమా కెరీర్‌కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. మిస్ ఇండియా విన్నర్‌‌కు డబ్బులేం ఇవ్వరు. కాకపోతే, ఏడాది పాటు జిమ్, హెయిర్ స్టైలింగ్, డ్యాన్స్ క్లాసెస్ వంటి సౌకర్యాలు మాత్రం పొందవచ్చు’’ అని మానస తెలిపింది.

Also Read- The Paradise film: తలైవా సినిమాకు పోటీగా నాని ది ప్యారడైజ్… బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ!

అలా సినిమా ఇండస్ట్రీపై ఆకర్షణ పెరిగింది

Advertisement

ఇక తను సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడానికి సంబంధించి మాట్లాడుతూ.. ‘‘నేను మిస్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్న టైమ్‌లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. నిజంగా నాకప్పుడు అసలేం అర్థం కాలేదు. నేను అందాల పోటీలకు రెడీ అవుతున్నాను కాబట్టే.. నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అనుకున్నాను. అలా.. మిస్ వరల్డ్ పోటీల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీపై (Cinema Industry) ఆకర్షణ పెరిగింది. అప్పటి నుంచి ఆడిషన్స్ చేయడం, స్క్రిప్ట్స్ వినడం వంటివి స్టార్ట్ చేశాను. నేను సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్లంతా చాలా భయపడ్డారు. తమ ఇంటి నుంచి అమ్మాయి సినిమాల్లోకి వెళ్తుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతగానో భయపడతాయి. మా ఫ్యామిలీ కూడా అంతే భయపడింది. ఇక్కడ ఎవరిని నమ్మాలి? మనకు తెలియని ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇలాంటి భయాలు వారికి ఉండేవి. ఇప్పుడు వాళ్లు కూడా అర్థం చేసుకుంటున్నారు’’ అని మానస వారణాసి చెప్పుకొచ్చింది.

Also Read- Karthikeya Wife: గుడ్ న్యూస్ చెప్పిన హీరో కార్తికేయ వైఫ్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×