The Paradise: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేస్తున్నామంటూ, మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. కానీ, చిత్రీకరణ పూర్తికాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా రిలీజైన మరుసటి రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా రిలీజ్ అంటూ డేట్ ప్రకటించారు. ఇప్పుడా చిత్రం కూడా వాయిదా పడింది. ‘పెద్ది’ (Peddi) సినిమాను ఏప్రిల్ 30వ తేదీన విడుదల అని మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. మరి నాని ‘ది ప్యారడైజ్’ ఎప్పుడు రిలీజ్? అనే దానిపై తాజాగా ఆ చిత్ర మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
Also Read- Kayadu Lohar: అందాలతో చెమటలు పట్టిస్తున్న కయాదు లోహర్!
నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ చిత్రం 2026, ఆగస్ట్ 26వ తేదీన విడుదల (The Paradise Release Date) కాబోతుందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు అల్లిన జడల మధ్య రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. రెండు జడలకు చివర నెత్తిటి చుక్కలు పడుతుండటం గమనించవచ్చు. ఈ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో రక్తపుటేరులు పారినట్లుగా అర్థమవుతోంది. పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని వేచి చూసేలా చేసింది. సినిమా వాయిదా అంటూ మేకర్స్ ప్రకటించడంతో, ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. ఈ సంవత్సరం విడుదలవుతుందా? అనేలా అనుమానాలు కూడా మొదలయ్యాయి. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ.. ఆగస్ట్ 26న ఈ పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read- Toxic Film: టాక్సిక్ సినిమాను చుట్టు ముట్టిన వివాదాలు.. క్రైస్తవ మతస్థుల నుంచి ఎదురు దెబ్బ!
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వందలాది మంది డ్యాన్సర్స్‌తో కూడిన భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్’ షూటింగ్ ప్రారంభమైనట్లుగా రీసెంట్‌గా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్ ఇదని తెలుస్తోంది. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్ అని మేకర్స్ అంటున్నారు. విజయ్ ‘జన నాయగన్’ కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఈ సాంగ్‌ను విజువల్ స్పెక్టకిల్‌గా మలుస్తున్నారని.. నాని ట్రేడ్‌మార్క్ మాడ్‌నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట అద్భుతంగా ఉంటుందనేలా మేకర్స్ తెలిపారు.
Mere Pyaare Paradise Waasiyon – #JadalZamanaFromAug21 🔥🌋🥁#TheParadise GRAND RELEASE WORLDWIDE ON AUGUST 21st, 2026 ❤🔥
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An… pic.twitter.com/n0VWPBFN0y— SLV Cinemas (@SLVCinemasOffl) February 12, 2026
Also Read- Priyanka Chopra: గ్లోబల్ స్టేటస్ వెనుక కన్నీటిగాథ.. భారతీయులు అలాంటి పాత్రలకే?