E-Paper
Advertisement

Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!
Advertisement

Fire Safety Awareness: నిప్పుతో ఊహించ‌ని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల స‌మ‌యంలో మంట‌లు వ్యాపించే ప‌రిస్థితి ఉంది. వ‌చ్చేది వేస‌వి కాలం.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అగ్ని ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అగ్ని మాప‌క నిబంధ‌న‌ల‌న్నీ తూచా త‌ప్ప‌కుండా అంద‌రూ పాటించాలి. వ‌చ్చేది వేస‌వి కాలం.. మ‌రింత ప్ర‌మాదం పొంచి ఉంది. న‌గ‌రంలో జ‌రిగిన అనేక అగ్ని ప్ర‌మాదాల‌ను ప‌రిశీలిస్తే నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అందుకే హైడ్రా అగ్ని ప్ర‌మాదాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను పెద్ద యెత్తున చేస్తూ వ‌స్తోంది.. అని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు.

అగ్ని ప్ర‌మాదాల‌పై పాత‌బ‌స్తీలో గురువారం నిర్వ‌హించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యూ శ్రీ జుల్ఫీక‌ర్ తో క‌లిసి హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ పాల్గొని ప్ర‌సంగించారు. త‌ర‌చూ జ‌రుగుతున్న అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి నెలాఖ‌రులో త‌నిఖీలు చేప‌ట్టి 9 షాపుల‌ను సీజ్ చేసిన‌ట్టు గుర్తు చేశారు. ప‌లు వ్యాపార సంఘాల విన‌తుల మేర‌కు ఒక నెల రోజులు స‌మ‌యం ఇచ్చామ‌ని.. మార్చి నెల రెండో వారం నుంచి త‌నిఖీలు ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఆయా వ్యాపార స‌ముదాయాల‌ను, షాపుల‌ను సీజ్ చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ హెచ్చ‌రించారు.

Advertisement

అగ్ని ప్ర‌మాదాల నేప‌థ్యంలో హైడ్రా త‌నిఖీలు చేయ‌డం.. నిబంధ‌న‌లు పాటించ‌క‌ని వ్యాపార సుముదాయాల‌ను సీజ్ చేయడాన్ని వేధించ‌డంగా భావించ‌వ‌ద్ద‌ని.. జాగ్ర‌త్త ప‌డ‌డంగా ప‌రిగ‌ణించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని వ్యాపార‌ సంఘాల ప్ర‌తినిధులతో పాటు.. పౌరుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు హైడ్రా పెద్ద పీట వేస్తుంద‌న్నారు. వ్యాపారాలు ప్ర‌శాంతంగా చేసుకోండి.. జాగ్ర‌త్త‌లు పాటించండి.. మీతో పాటు.. మీ విలువైన వినియోగ‌దారుల భ‌ద్ర‌త గురించి ఆలోచించండి అని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదాల వీడియోలు, రెస్క్యూ ఆప‌రేష‌న్లు, అగ్ని ప్ర‌మాదాల‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. అగ్ని ప్రమాదాలకు ఎవరు బాధ్యులు అనేది గ్రహించాలని చార్మినార్ MLA జల్ఫికర్ అన్నారు. ప్రమాదాలు జరగక ముందే అప్రమత్తమవ్వాలని సూచించారు. రంజాన్ మాసం వ్యాపారాలు జరుగుతాయి స్టాకును భద్రపరిచినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికి వారు చెక్ చేసుకోవాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య ఆర్ఎఫ్వో శ్రీ జయప్రకాష్ , dfo లు యజ్ఞ నారాయణ, వెంకన్న, విద్యుత్ విభాగం అధికారి ఏవీ రామారావు, సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డితో పలు విభాగాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Also Read: డ్రగ్స్ మాఫియాపై ‘ఈగల్’ పంజా.. తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్ అంతమే లక్ష్యం!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×