E-Paper
Advertisement

Manchu Lakshmi: బొడ్డు కనిపించడం ఆర్ట్.. తప్పేముందన్న మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: బొడ్డు కనిపించడం ఆర్ట్.. తప్పేముందన్న మంచు లక్ష్మీ!
Advertisement

Manchu Lakshmi: మంచు లక్ష్మి నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. ఈమె మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న మంచు లక్ష్మి నిత్యం సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మంచు లక్ష్మి ” ది మేల్ ఫెమినిస్ట్” అనే పాపులర్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల గురించి వారి వస్త్రధారణ గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు..

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు సినిమాలకు అనుగుణంగా వస్త్రధారణ ధరించాలి అయితే చాలామంది సెలబ్రిటీల వస్త్రధారణ పై విమర్శలు కురిపిస్తుంటారు. ఈ విషయం గురించి మంచు లక్ష్మి మాట్లాడారు. స్టార్ కిడ్ అని ఇండస్ట్రీలో నాకు అన్ని సులువుగా దొరుకుతాయని చాలామంది భావిస్తారు. కానీ నేను కూడా అందరిలాగే ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఇక వస్త్రధారణ విషయంలో కూడా విమర్శలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. నార్త్ ఇండస్ట్రీకి సౌత్ ఇండస్ట్రీకి వస్త్రధారణ విషయంలో పూర్తిగా వ్యత్యాసం ఉందని వెల్లడించారు.

పద్ధతుల పేరుతో ఒత్తిడి..

Advertisement

మన సౌత్ ఇండస్ట్రీలో పద్ధతుల పేరుతో మహిళలపై అధిక ఒత్తిడిని తీసుకువస్తున్నారని తెలిపారు. కొన్ని సందర్భాలలో సన్నివేశానికి అనుగుణంగా మనం నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో బొడ్డు కనిపిస్తే తప్పుగా భావిస్తున్నారు బొడ్డు కనిపించడం అనేది తప్పు కాదని అది ఒక ఆర్ట్ అంటూ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమాల పరంగా బొడ్డు కనిపిస్తే సమాజం మహిళల శరీరాన్ని తప్పుగా చూపిస్తుంది అంటూ ఈమె విమర్శలు కురిపించారు. నార్త్ ఇండస్ట్రీకి సౌత్ ఇండస్ట్రీకి చాలా వ్యత్యాసం ఉందని కొన్ని విషయాలలో మారాల్సిన సమయం వచ్చిందని ఈమె తెలిపారు.

మోహన్ బాబు వారసురాలిగా..

Advertisement

ఇలా మంచు లక్ష్మి వస్త్రధారణ గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి కెరియర్ విషయానికి వస్తే మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు అయితే ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం పడలేదని చెప్పాలి. ఇక ఇటీవల ఈమె దక్ష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలలో కూడా మంచు లక్ష్మి సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Also Read: Actress Trisha: ఇక చాలు ఆపండి.. అసహ్యంగా ఉంది ఫేక్ వార్తలపై ఫైర్ అయిన త్రిష!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×