E-Paper
Advertisement

Actress Trisha: ఇక చాలు ఆపండి.. అసహ్యంగా ఉంది ఫేక్ వార్తలపై ఫైర్ అయిన త్రిష!

Actress Trisha: ఇక చాలు ఆపండి.. అసహ్యంగా ఉంది ఫేక్ వార్తలపై ఫైర్ అయిన త్రిష!

Actress Trisha: సినీ నటి త్రిష గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఇప్పటికి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ తెలుగు తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక త్రిష నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇంకా సింగిల్గానే జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే త్రిష పెళ్లికి (wedding)సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉన్నాయి. గతంలో ఈమెకు వివాహం నిశ్చయమైంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన త్రిష హనీమూన్ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ సెటైర్లు పేల్చారు.

తప్పుడు కథనాలపై మండిపడ్డ త్రిష ..

తాజాగా మరోసారి త్రిష సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ఈ ఫేక్ వార్తలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈమె నటుడు విజయ్ తో (Vijay)రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇలా ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ఆయనతో కలిసి చాలా క్లోజ్ గా ఉన్న ఫోటో బయటకు రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అప్పటినుంచి నిత్యం పెళ్లి వార్తలు వినపడుతున్న నేపథ్యంలో తాజాగా త్రిష స్పందించారు.

ఫోటో దిగితే పెళ్లి చేస్తారా?

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ఇలా తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే మీరు వారందరితో నా పెళ్లి చేయడం చాలా అసభ్యకరంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మానుకోండి అంటూ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలపై త్రిష కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష గతంలో నిశ్చితార్థం జరుపుకొని అనంతరం బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈమె పెళ్లి గురించి ఆలోచించకుండా కేవలం కెరియర్ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

చిరంజీవికి జోడిగా త్రిష..

ఇక ప్రస్తుతం త్రిష సినిమాల విషయానికి వస్తే తాజాగా ఈమె చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక చిరంజీవి త్రిష కాంబినేషన్లో ఇదివరకే స్టాలిన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా అనంతరం మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Varanasi: వారణాసి ఈవెంట్ ఖర్చు ఎంతో తెలుసా..ఈ డబ్బుతో ఓసినిమా చేయొచ్చు తెలుసా?

Related News

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×