E-Paper
Advertisement

Manchu Lskshmi: మంచు లీక్స్… శ్రీనివాస మంగాపురంలో మోహన్ బాబు.. క్యారెక్టర్ లీక్ చేసిన మంచు లక్ష్మి!

Manchu Lskshmi: మంచు లీక్స్… శ్రీనివాస మంగాపురంలో మోహన్ బాబు.. క్యారెక్టర్ లీక్ చేసిన మంచు లక్ష్మి!
Advertisement

Manchu Lskshmi:  ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు మీడియా ముందుకు వస్తుంటే కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండానే ఇతర సినిమాలకు సంబంధించిన విషయాలను లీక్ చేస్తూ ఉంటారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలను లీక్ చేస్తూ ఉండడంతో అభిమానులు మెగా లీక్స్ అంటూ పేరు పెట్టేశారు. అయితే ఈ కోవకే మంచు లక్ష్మి కూడా చెందుతారని చెప్పాలి. మంచు లక్ష్మి (Manchu Lakshmi) మీడియా ముందుకు వచ్చిందంటే తన తండ్రి మోహన్ బాబు(Mohan Babu) సినిమాలకు సంబంధించిన విషయాలన్నింటిని బయట పెట్టేస్తూ ఉంటారు. గతంలో నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి మోహన్ బాబు పాత్రను రివిల్ చేయకుండానే మంచు లక్ష్మి మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారనే విషయాన్ని బయట పెట్టారు.

హీరోయిన్ తండ్రిగా మోహన్ బాబు..

ఇలా మంచు లక్ష్మి లీక్ చేసిన కొద్ది రోజులకే చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించాల్సి వచ్చింది.. అయితే తాజాగా మంచు లక్ష్మి బూకీ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలలో ఇతర భాష సెలబ్రిటీలందరూ భాగం కావడం చాలా మంచిగా ఉందని ఈమె తెలియజేశారు. ఇలా సినిమాల గురించి మాట్లాడుతూ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో రవీనా టాండన్ కూతురు హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆ పిల్లకు తండ్రి పాత్రలో నాన్నగారు నటిస్తున్నారనే విషయాన్ని ఈమె లీక్ చేశారు. ఇలా మంచు లక్ష్మి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాషా తడాని (Rasha Tadani)తండ్రిగా మోహన్ బాబు నటించిన బోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

శ్రీనివాస మంగాపురం..

Advertisement

ఇలా మంచు లక్ష్మి మోహన్ బాబు క్యారెక్టర్ మొత్తం బయట పెట్టడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు కానీ మంచు లక్ష్మి మోహన్ బాబు పాత్రను కూడా రివీల్ చేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది. ఇక శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కృష్ణ మనవడు జయకృష్ణను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా లవ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. జయ కృష్ణకు జోడిగా రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా నటిస్తున్నారు.

Also Read: Varanasi film: ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 300 కోట్లు.. అసలేం చేస్తున్నావ్ జక్కన్న..

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×