E-Paper
Advertisement

Varanasi film: ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 300 కోట్లు.. అసలేం చేస్తున్నావ్ జక్కన్న..

Varanasi film: ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 300 కోట్లు.. అసలేం చేస్తున్నావ్ జక్కన్న..
Advertisement

Varanasi film: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి అయిందని 2026 జూన్ నాటికి మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని స్వయంగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటే మూడు నాలుగు సంవత్సరాల సమయం పడతాయి కానీ వారణాసి సినిమా మాత్రం ఏడాదిలోపే పూర్తి చేయబోతుండటం విశేషం. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన వాటిలో త్రేతా యుగానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలియజేశారు.

త్రేతాయుగం ఎపిసోడ్ కోసం..

ఇలా వారణాసి సినిమాలో త్రేతా యుగానికి సంబంధించిన సన్నివేశం సుమారు 25 నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. అయితే ఈ 25 నిమిషాల షూటింగ్ పూర్తి చేయడం కోసం రాజమౌళి ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ షూటింగ్ కోసం భారీ స్థాయిలో సెట్ ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా షూటింగ్ చేయడం కోసం చిత్ర నిర్మాతలు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వామ్మో ఒక్క ఎపిసోడ్ కోసం 300 కోట్లు ఏంటి జక్కన్న.. మరీ టూమచ్ గా లేదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

కోట్లు ప్రమోషన్లకే రూ. 200..

Advertisement

ఇక సినిమాల విషయంలో రాజమౌళి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారనే సంగతి మనకు తెలిసినదే. ప్రతి చిన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈయన ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక సినిమాలకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇక వారణాసి సినిమా కోసం చిత్ర నిర్మాతలు ఏకంగా 1300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఇలా 1300 కోట్లు సినిమా షూటింగ్ కోసం మరొక 200 కోట్లు అదనంగా ప్రమోషన్ల కోసం ఖర్చు చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

టైటిల్ లాంచ్ కోసం గ్లోబ్ ట్రాటర్…

Advertisement

సాధారణంగా ఒక సినిమా ప్రమోట్ చేయడం కోసం చిత్ర నిర్మాతలు ఒకటి లేదా రెండు కోట్లు ఖర్చు చేస్తారు కానీ రాజమౌళి మాత్రం ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారనే విషయం తెలిసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఈయన ఊహించని విధంగా తన సినిమాలను తారాస్థాయిలో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తుంటారు.. వారణాసి సినిమా టైటిల్ లాంచ్ కోసం ఈయన గ్లోబ్ ట్రాటర్ పేరిట ఎంతో ఘనంగా ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా ఈవెంట్లంటే ఈ స్థాయిలోనే ఉంటాయి .అందుకే చిత్ర నిర్మాతలు కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమా కోసం 1500 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం.

Also Read: Actor Vishal: ఆ విషయంలో విశాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు .. పిటిషన్ కొట్టివేత!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×