E-Paper
Advertisement

Manchu lakshmi : అమెరికా నాలో భయాన్ని పోగొట్టింది.. అలాంటి పాత్రలు చెయ్యడానికి నేను రెడీ..

Manchu lakshmi : అమెరికా నాలో భయాన్ని పోగొట్టింది.. అలాంటి పాత్రలు చెయ్యడానికి నేను రెడీ..
Advertisement

Manchu lakshmi : టాలీవుడ్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ.. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే అన్నీ ఉన్నా అదృష్టం లేకుంటే ఆ సినిమాలు సక్సెస్ అవ్వవు అన్న మాట ఈ అమ్మడుకు కరెక్టుగా వర్తిస్తుంది. అందం, అభినయం ఉన్న ఈమెకు సరైన హిట్ సినిమా పడలేదు.. సినిమాల్లో కీలక పాత్రలో నటించడంతో పాటుగా హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఈమధ్య దక్ష మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ లు ఇస్తుంది.. తాజాగా ఓ ఛానల్ కి ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా పర్సనల్ లైఫ్ గురించి, అమెరికా నుంచి వచ్చాకా లైఫ్ ఎలా మారిపోయింది అన్నది పంచుకుంది.. ఆ విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

అమెరికా నాలో ధైర్యాన్ని నింపింది..

మంచు లక్ష్మీ అమెరికాలో చదువుకున్న విషయం అందరికి తెలిసిందే.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె స్టడీ లైఫ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ..అమెరికాకు వెళ్లకు ముందు ఇంట్లో ఏది చెప్తే అదే చేయాలి అమ్మాయిలు ఇలానే ఉండాలి అని అనుకునేదాన్ని. అయితే అమెరికాకు వెళ్లిన తర్వాత నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది అని మంచు లక్ష్మీ అన్నారు. పీజీ అయిపోయేంతవరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ మా నాన్న మాత్రం నన్ను ఇండియాకి రమ్మని ఒత్తిడి చేశారు. మా అమ్మని మనోజ్ ను రెండు నెలలు అక్కడే ఉంచి మరి నన్ను రమ్మని పిలిచారు. కానీ నేను మాత్రం ఇండియాకి తిరిగి రానే రాలేదు. ఆ ధైర్యం నాకు అమెరికా ఇచ్చింది అని నిర్మొహమాటంగా చెప్పేసింది.. ఇక నేను చెప్పింది వినదు అని మా నాన్న నన్ను వదిలేసాడు. అలా చదువు పూర్తి చేశాను జాబ్ కూడా చేశాను అని ఆమె అన్నారు. నన్ను అబద్ధం చెప్పి ఇండియాకి రప్పించారు ఆ తర్వాత నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.. ఇప్పుడు నా కెరియర్ ని నేను బిల్డ్ చేసుకోవడానికి ముంబైకి షిఫ్ట్ అయ్యాను అని ఆమె తెలిపారు..

Advertisement

Also Read : ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బోల్డ్ పాత్రలు చెయ్యడానికి నేను రెడీ.. 

మంచు లక్ష్మి ఇప్పటివరకు ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఇలాంటివి నటించాలి.. పాత్రలు మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అని మీ ఇంట్లో ఫోర్స్ చేస్తారా అని యాంకర్అడిగారు.. ఒకప్పుడు ఎవరికోసమో భయపడేదాన్ని.. కానీ ఇప్పుడు మాత్రం ఇది నా లైఫ్ నా గురించి మాత్రమే నేను ఆలోచించాలి అని ఫిక్స్ అయ్యాను. ఎటువంటి క్యారెక్టర్లు చేయడానికి అయినా నేను రెడీ అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ముంబై లో ఉంటున్న ఆమె కొత్త సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. ఇక అందరూ ఊహించినట్లుగానే మంచు లక్ష్మి ఈమధ్య సోషల్ మీడియాలో ట్రెండీ వేర్ లతో ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటుంది. తనలోని హాట్ యాంగిల్ ను పరిచయం చేస్తుంది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకముందు ఎలాంటి పాత్రలో మంచు లక్ష్మీ కనిపిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది..

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×