E-Paper
Advertisement

Amla: ఆరోగ్యానికి మంచిదని ఉసిరికాయ ఎక్కువగా తింటున్నారా ? నిపుణులు చెప్పేది వెంటే షాక్ అవుతారు

Amla: ఆరోగ్యానికి మంచిదని ఉసిరికాయ ఎక్కువగా తింటున్నారా ? నిపుణులు చెప్పేది వెంటే షాక్ అవుతారు
Advertisement

Amla: ఉసిరి మన ఆరోగ్యానికి ప్రకృతి అందించిన గొప్ప వరం. దీనిని “సూపర్‌ఫుడ్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే.. ఏ ఆరోగ్యకరమైన ఆహారాన్నైనా మోతాదుకు మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఉసిరిని అతిగా తీసుకుంటే ఎదురయ్యే 5 ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. జీర్ణ సమస్యలు, మలబద్ధకం:

ఉసిరిలో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉంటుంది. ఇది సాధారణంగా జీర్ణక్రియకు మంచిదే. కానీ అతిగా తీసుకున్నప్పుడు.. ఈ అధిక ఫైబర్ పేగులలో పేరుకుపోయి, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. కొంత మందిలో ఇది తీవ్రమైన మలబద్ధకానికి దారితీయవచ్చు. ముఖ్యంగా.. ఉసిరిని తిన్న తర్వాత తగినంత నీరు తాగకపోతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫైబర్ నీటిని పీల్చుకోవడం వల్ల పేగుల్లోని వ్యర్థాలు గట్టిపడి కదలిక కష్టమవుతుంది.

Advertisement

2. రక్తంలో చక్కెర స్థాయిలు అతిగా తగ్గడం:

ఉసిరి మధుమేహ రోగులకు చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అయితే.. అతిగా తీసుకుంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రమాదకర స్థాయిలో తగ్గించేస్తుంది. ఇప్పటికే షుగర్ కంట్రోల్ కోసం మందులు వాడుతున్న వారు ఉసిరిని అధిక మోతాదులో తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అతిగా తగ్గిపోయి హైపోగ్లైసీమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. హైపోగ్లైసీమియాలో తలతిరగడం, చెమట పట్టడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

3. యూరిన్‌లో మంట, డీహైడ్రేషన్:

ఉసిరి సహజంగానే యూరినేషన్‌ను ప్రేరేపిస్తుంది. దీనిని అతిగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. తరచుగా యూరిన్ రావడం వల్ల శరీరంలోని ద్రవాలు అధికంగా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడే ప్రమాదం ఉంది. కొందరిలో.. ఉసిరిలోని ఆమ్ల స్వభావం కారణంగా మూత్ర విసర్జన సమయంలో మంట కలగే ప్రమాదం కూడా ఉంటుంది. ఉసిరి తీసుకునేటప్పుడు అధికంగా నీరు తాగడం చాలా ముఖ్యం.

4. అధిక ఆమ్లత్వం, కడుపులో అల్సర్లు:

ఉసిరిలో సహజ సిద్ధమైన విటమిన్ సి, ఇతర ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో లేదా అతిగా తీసుకుంటే ఈ ఆమ్లత్వం సమస్యలు పెరుగుతాయి. ఉసిరిని ఎక్కువగా లేదా సరిగా జీర్ణం కాని సమయంలో తింటే, కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వస్తుంది. దీర్ఘకాలికంగా అధిక వినియోగం సున్నితమైన కడుపు ఉన్నవారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా కడుపులో అల్సర్ల ప్రమాదాన్ని పెంచవచ్చు.

5. రక్తస్రావం సమస్యలు: ఉసిరి సహజంగానే రక్తాన్ని పలుచగా చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని తగ్గించే మందులు వాడుతున్నవారు. ఉసిరిని అధిక మోతాదులో తీసుకుంటే.. రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. శస్త్రచికిత్స చేయించుకోబోయే ముందు లేదా తర్వాత ఉసిరి వాడకాన్ని తగ్గించడం లేదా డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.

ఉసిరి అమృతం లాంటిది. రోజుకు ఒకటి లేదా రెండు ఉసిరికాయలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా సరే.. మోతాదు మించితే విషమే అనే సూత్రాన్ని గుర్తుంచుకుని.. మీ డైట్‌లో ఉసిరిని మితంగా చేర్చుకోవడం ఉత్తమం. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఉసిరిని అధికంగా తీసుకోవడానికి ముందు డాక్టర్‌ని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Related News

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

Big Stories

Advertisement
×