E-Paper
Advertisement

Manchu Lakshmi: మా కుటుంబం మొత్తం కలిసే ఉండాలి.. మంచు ఫ్యామిలీలో విభేదాలు తొలగి పోలేదా?

Manchu Lakshmi: మా కుటుంబం మొత్తం కలిసే ఉండాలి.. మంచు ఫ్యామిలీలో విభేదాలు తొలగి పోలేదా?
Advertisement

Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. మోహన్ బాబు(Mohan Babu) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి (Manchu Lakshmi)ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా నటిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ముంబైలో స్థిరపడిన మంచు లక్ష్మి..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మంచు లక్ష్మి తన సినిమా కెరియర్ గురించి అలాగే తన కుటుంబం గురించి తన కుమార్తె గురించి కూడా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మంచు లక్ష్మీ ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాను ముంబైలో ఉన్నప్పటికీ ప్రతి వీకెండ్ హైదరాబాద్ వచ్చి అందరితో సరదాగా గడుపుతానని తెలిపారు. ఇక నేను ముంబైలో ఉండడంతో నన్ను చూడటానికి అమ్మ, మనోజ్, మున్ని అందరూ కూడా అక్కడికి వస్తుంటారని వారితో కూడా నేను ముంబైలో బాగా టైం స్పెండ్ చేస్తానని తెలిపారు.

నా కుటుంబం కలిసే ఉండాలి..

Advertisement

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దేవుడు నీకు ఏదైనా ఒక వరం కోరుకొమ్మని అడిగితే ఏం కోరుకుంటారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మంచు లక్ష్మి ఎప్పటికి నా కుటుంబం కలిసే ఉండాలని కోరుకుంటాను అంటూ ఈమె సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ గొడవలన్నీ ముగిసిపోయాయని, అందరూ కలిసిపోయారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు కానీ మంచు లక్ష్మి నా కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటాను అని చెప్పడంతో ఇంకా మంచు కుటుంబంలో ఉన్న విభేదాలు పూర్తిగా తొలగి పోలేదా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మనోజ్ విష్ణు మధ్య గొడవలు..

Advertisement

మంచు విష్ణు మనోజ్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకునే వరకు వెళ్లారు. కానీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ఒకరి సినిమాలపై మరొకరు కామెంట్లు చేయడంతో గొడవలు సర్దుమనిగాయని భావించారు కానీ ఇటీవల మోహన్ బాబు 50 సంవత్సరాల సినీ జర్నీ పూర్తి కావడంతో గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి కనిపించలేదని తెలుస్తుంది.. ఈ కుటుంబంలో విభేదాలు పూర్తిగా తొలగిపోలేదని అందుకే మంచు లక్ష్మి అలా మాట్లాడారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు లక్ష్మి కోరుకున్న విధంగా ఎప్పటికీ మంచు కుటుంబం కలిసి ఉండాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Also Read: Rahul Sipligunj -Harinya wedding: అంగరంగ వైభవంగా రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యల వివాహం!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×