E-Paper
Advertisement

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో విబేధాలు.. ఒక్క పోస్టుతో రూమర్లకు చెక్ పెట్టిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో విబేధాలు.. ఒక్క పోస్టుతో రూమర్లకు చెక్ పెట్టిన మంచు లక్ష్మి!
Advertisement

Manchu Lakshmi: తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు నటుడిగా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. ఈయన వారసులుగా తన ముగ్గురు పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం లక్ష్మి, విష్ణు ,మనోజ్ ముగ్గురు కూడా వారి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇలా వీరి సినిమాల విషయం పక్కన పెడితే గత కొంతకాలంగా మంచు కుటుంబంలో విభేదాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒకానొక సమయంలో మంచు బ్రదర్స్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కొట్టుకోవడం జరిగింది.

నలుగు వేడుకలో మోహన్ బాబు..

ఇలా ఈ కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో తరచూ వార్తల్లో నిలిచారు. అయితే ఇటీవల కాలంలో వీరి కుటుంబంలో విభేదాలు సర్దుమనిగాయని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలోనే మళ్లీ విభేదాలు చోటు చేసుకున్నాయి అంటూ ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. మంచు లక్ష్మి కుమార్తె విద్య నిర్వాణ ఓణీల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ దంపతులు మాత్రమే కనిపించారు మోహన్ బాబు అలాగే విష్ణు భార్య పిల్లలు కనిపించకపోవడంతో మళ్లీ ఈ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి అంటూ వార్తలు బయటకు వచ్చాయి.

హాజరైన విష్ణు భార్య పిల్లలు..

Advertisement

ఇలా మోహన్ బాబు మంచు విష్ణు ఫ్యామిలీ హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో మంచు లక్ష్మి ఈ వార్తలకు చెక్ పెట్టారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన కూతురి వేడుకకు సంబంధించిన మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో భాగంగా తన కుమార్తెకు నలుగు పెట్టే సమయంలో తన తండ్రి మోహన్ బాబుతో పాటు తన సోదరుడు విష్ణు భార్య పిల్లలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇలా నలుగు పెట్టె కార్యక్రమంలో వీరందరూ పాల్గొనడంతో ఈ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి అంటూ వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయ్యింది. అయితే నలుగు వేడుకలో మనోజ్ ఫ్యామిలీ కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ హాఫ్ సారీ వేడుకలో విష్ణు ఫ్యామిలీతో పాటు మోహన్ బాబు కనిపించకపోవడంతో ఈ రూమర్ లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం మోహన్ బాబుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక పోతే ప్రస్తుతం మంచు కుటుంబంలోని హీరోలందరూ కూడా వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మోహన్ బాబు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండగా మనోజ్ సైతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక విష్ణు ఇటీవల కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

Also Read: The Paradise Film: ఆ నిర్మాణ సంస్థకే నాని ది ప్యారడైజ్ ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ ..

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×