E-Paper
Advertisement

Putta Sudhakar: మెయినాబాద్ డ్రగ్స్ ఇష్యూ.. మా కొడుకు తప్పు చేయలేదు, పుట్టా సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

Putta Sudhakar: మెయినాబాద్ డ్రగ్స్ ఇష్యూ.. మా కొడుకు తప్పు చేయలేదు, పుట్టా సుధాకర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Putta Sudhakar: మెయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం టీడీపీలో కొందరు నేతలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై పుట్టా సుధాకర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రాణాపాయం ఉన్నప్పుడు తన కొడుకు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

మెయినాబాద్ డ్రగ్స్ అంశం.. మా కొడుకు తప్పు చేయలేదు-పుట్టా సుధాకర్  

Advertisement

మెయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ కేసులో 9 మంది నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తేలింది. దీనిపై లోతుగా సిట్ దర్యాప్తు చేస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.

ఈ విషయం బయటకు రాగానే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు టీడీపీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ వ్యవహారం ఇంకా నలుగుతుండగానే పలుమార్లు ఎంపీ మహేష్ కుమార్ వీడియోలు విడుదల చేశారు. తనకు ఏమీ తెలీదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఎంపీ తండ్రి, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ నోరువిప్పారు.

Advertisement

హార్ట్ ఆపరేషన్ జరిగినవాళ్లు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్న

మెయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. 2021లో పుట్టా మహేశ్‌కు హార్ట్ ఆపరేషన్ జరిగిందన్నారు. ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ సూచించారని తెలిపారు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బ్లడ్ తీసుకోకుండా డ్రగ్ పాజిటివ్ ఎలా వస్తుందని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

వాళ్లు చెప్పిన ప్రకారం బ్లడ్ తీసుకున్నా రిపోర్ట్ రావడానికి 48 గంటల సమయం పడుతుందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో తమకు 48 గంటల తర్వాత బ్లడ్ రిపోర్టు ఇచ్చారన్నారు. అక్కడ నెగిటివ్ వచ్చిందన్నారు. యూరిన్ శాంపిల్స్ తీసుకుని 5 నిమిషాల్లో రిజల్ట్ చెప్పారన్నారు. రెండోసారి యూరిన్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఐదు గంటలు సమయం ఎలా పట్టిందన్నారు. ఈ విషయంలో మీరే ఆలోచించుకోవాలన్నారు.

ALSO READ: ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. పిడుగులు, ఈదురు గాలులతో జాగ్రత్త!

ఈ ఘటనపై పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చామన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే పల్స్ రేటు 150 నుంచి 200 వరకు ఉంటుందన్నారు. ఆనాడు మా అబ్బాయికి  97 మాత్రమే పల్స్ రేటు ఉందన్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ చేస్తున్నారని తాము వాస్తవాలు చెప్పలేదన్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఆధారాలతోపాటు అన్నీ బయటపెడతానని అన్నారు పుట్టా సుధాకర్ యాదవ్.

 

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×