E-Paper
Advertisement

Movie updates: బిగ్ సినిమా ఫటాఫట్..సెన్సేషనల్ అప్‌డేట్స్

Movie updates: బిగ్ సినిమా ఫటాఫట్..సెన్సేషనల్ అప్‌డేట్స్
Advertisement

Updates: వేణు ‘ఎల్లమ్మ’ – డీఎస్పీ ఎంట్రీ.. కీర్తి ఎగ్జిట్!
‘బలగం’తో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’అంటూ రెడీ అయిపోయాడు.
ఈ సినిమాతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు.అయితే, మొదటగా  హీరోయిన్‌గా అనుకున్న కీర్తి సురేష్.. హీరోగా డీఎస్పీ ఫిక్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. కీర్తి ప్లేస్‌లో ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే దాదాపు ఖరారైనట్లు సమాచారం. దేవిశ్రీ-భాగ్యశ్రీల ఈ ఫ్రెష్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి!

అనుష్క ‘కథానార్’ – జేజమ్మ ఈజ్ బ్యాక్!
గతేడాది ‘ఘాటీ’తో నిరాశపరిచిన స్వీటీ.. ఇప్పుడు తన సెంటిమెంట్ ‘హారర్’ జానర్‌తోనే కమ్ బ్యాక్ ఇస్తున్నారు. అదే మలయాళ పీరియడ్ హారర్ ఎపిక్ ‘కథానార్ – ది వైల్డ్ సోర్సరర్’.తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ భయంకరంగా ఉంది. మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు టీజర్ గ్లింప్స్ రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో అనుష్క మళ్ళీ గడగడలాడించడం ఖాయం!

Advertisement

రామ్ చరణ్ ‘పెద్ది’ – క్లైమాక్స్ ట్విస్ట్ వెనుక మిస్టరీ!
‘ఉప్పెన’ క్లైమాక్స్‌తో షాక్ ఇచ్చిన బుచ్చిబాబు.. ‘పెద్ది’లో అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ప్లాన్ చేశారట. చరణ్ బల్క్ బాడీ ఫోటోలో కాళ్లు సరిగ్గా కనిపించకపోవడంతో, కథలో ఏదైనా ఫిజికల్ డిజెబిలిటీ ఎలిమెంట్ ఉండబోతుందా? అనే చర్చ నడుస్తోంది.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో ఐదుగురు హీరోయిన్లతో చరణ్ చేసే మాస్ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించబోతోంది. ఏప్రిల్ 30న అసలు లెక్క తేలనుంది!

పవన్ Vs రణ్‌వీర్ – బాక్సాఫీస్ సెంటిమెంట్ రిపీట్?
థియేటర్లలో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మరియు పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మధ్య పోటీ పీక్స్‌కు చేరింది.
గతంలో ‘పంజా’, ‘బ్రో’ టైంలోనూ రణ్‌వీర్ సినిమాలే పైచేయి సాధించాయి.
‘ఉస్తాద్’ కి డివైడ్ టాక్ వస్తుండటంతో.. ముచ్చటగా మూడోసారి రణ్‌వీర్ బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచేలా కనిపిస్తున్నడంటున్నారు ట్రేడ్ పండిట్స్.

Advertisement

ఎన్టీఆర్ బర్త్ డే బ్లాస్ట్ – ‘ఊసరవెల్లి’ రీ-రీలీజ్!
మే 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్‌లో మళ్ళీ ‘ఊసరవెల్లి’ మేనియా మొదలవబోతోంది.సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్, తారక్ ఎమోషనల్ యాక్షన్ మళ్ళీ వెండితెరపై చూడటానికి నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్లను బుక్ చేసుకునే పనిలో పడ్డారు. ఉగాది వేళ వచ్చిన ఈ గుడ్ న్యూస్ ఇపుడు తారక్ ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేస్తుంది .

also read : డైలాగ్ కింగ్ @ 74 – ది లెజెండ్ ఆఫ్ మోహన్ బాబు

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×