E-Paper
Advertisement

IRCTC Tour Package: నవరాత్రి వేళ వైష్ణోదేవి దర్శనం.. IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ!

IRCTC Tour Package: నవరాత్రి వేళ వైష్ణోదేవి దర్శనం.. IRCTC  అదిరిపోయే టూర్ ప్యాకేజీ!
Advertisement

IRCTC Vaishno Devi Tour Package: నవరాత్రి సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. తొమ్మిది రోజులలో అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ రోజులలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక దేశంలోని కొన్ని అమ్మవారి ఆలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి. విజయవాడ కనకదుర్గతో పాటు జమ్మూకాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాల్లో నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో IRCTC తాజాగా మరో క్రేజీ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. వైష్ణో దేవి టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ మీరు చాలా కాలంగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. జమ్మూ కాశ్మీర్‌ లోని పవిత్ర వైష్ణో దేవి ఆలయ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్యాకేజీ వివరాల గురించి..

IRCTC యాత్రికుల కోసం మాతా వైష్ణోదేవి ఎక్స్ ఢిల్లీ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేలా చేస్తుంది. ఈ ప్యాకేజీ కోడ్ NDR01. ఈ టూర్ 3 రాత్రులు, 4 రోజులు ఉంటాయి. ఈ ప్రయాణంలో రెండు రాత్రులు రైలులో, ఒక రాత్రి కత్రాలోని హోటల్‌లో బసతో పాటు, రవాణా, వసతి,  దర్శనం కోసం పూర్తి ఏర్పాట్లు ఉంటాయి. ఈ ప్రయాణం రాత్రి 8:40 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మీరు 12425 నంబర్ రైలులో జమ్మూకు బయలుదేరి, ఉదయం 5 గంటల ప్రాంతంలో కత్రా స్టేషన్‌కు చేరుకుంటారు.

జమ్మూలోని ప్రధాన దేవాలయాల దర్శనం

Advertisement

ఈ టూర్ ప్యాకేజీ మిమ్మల్ని మాతా వైష్ణో దేవిని సందర్శించడానికే కాకుండా, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. వీటిలో కంద్ కండోలి ఆలయం, రఘునాథ్‌ జీ ఆలయం, బాగ్ ఎ బహు గార్డెన్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల పర్యటన తర్వాత, మధ్యాహ్నం మిమ్మల్ని జమ్మూకు తీసుకువెళతారు. ఈ ప్యాకేజీ     మార్చి 24న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది.

Read Also: ఇక మరింత వేగంగా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!

సరసమైన టూర్ ప్యాకేజీ

Advertisement

ఈ ప్యాకేజీతో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది. 3AC క్లాస్‌ లో ఈ ట్రిప్‌ కు సింగిల్ షేరింగ్ కోసం రూ. 10,770 ఖర్చవుతుంది. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ఛార్జీలు వరుసగా ఒక్కొక్కరికి రూ.8,100, రూ. 6,990గా ఉంటాయి. మీరు ఈ ప్యాకేజీని IRCTC అధికారిక వెబ్‌ సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ గురించి మరింత సమాచారం కోసం, ఈ నెంబర్స్ కు కాల్ చేయాలని (9717648888, 8287930712, మరియు 8287930620) IRCTC సూచించింది.

Read Also: అప్పర్ బెర్త్ vs లోయర్ బెర్త్.. లాంగ్ ట్రైన్ జర్నీస్ లో పడుకోవడానికి ఏది బెస్ట్?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×