E-Paper
Advertisement

ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇప్పుడు ఈగలు తోలడం.. ఈ సారి కంబ్యాక్..

ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇప్పుడు ఈగలు తోలడం.. ఈ సారి కంబ్యాక్..
Advertisement

Mani Sharma: టాలీవుడ్ మ్యూజిక్ హిస్టరీని ‘మణిశర్మకు ముందు.. మణిశర్మ తర్వాత’ అని విభజించవచ్చు. రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా సంగీతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈ ‘మెలోడీ బ్రహ్మ’ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీని, ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Read also-‘పెద్ది’ షూట్‌లో గాయపడిన ‘రామ్ చరణ్’ను చూశారా.. పాపం భయ్యా..

“నా హార్మోనియం ఎక్కడుందో కూడా తెలియదు”

Advertisement

ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మణిశర్మ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. “ప్రతిరోజూ ఉదయం లేచి నా పనులు నేను చేసుకుంటూ, ఏ పనీ లేక ఈగలు తోలుకుంటూ కూర్చుంటున్నాను. అలాంటి సమయంలో ఈ చిత్ర దర్శకుడు నా దగ్గరకు వచ్చారు. అసలు నా హార్మోనియం ఎక్కడుందో, ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయిన పరిస్థితి నాది. కానీ దర్శకుడు నన్ను వెతికి పట్టుకుని, నాలోని సంగీతాన్ని మళ్ళీ బయటకు తీశారు” అని వ్యాఖ్యానించారు.

అప్పట్లో ఒక ప్రభంజనం

ఒకప్పుడు మణిశర్మ అంటే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ఆయన పాటల కోసమే థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు ఉండేవారు. చిరంజీవి ‘ఇంద్ర’, బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’, మహేష్ బాబు ‘ఒక్కడు’.. ఇలా ఏ సినిమా చూసినా మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లేలా చేసేది. ‘మురారి’, ‘ఖుషి’ చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే మణిశర్మ సంగీతం ఉండాల్సిందే అన్నట్లుగా ఉండేది పరిస్థితి.

ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యారు?

Advertisement

ప్రతిభకు కొదవ లేకపోయినా, మణిశర్మ కెరీర్ గ్రాఫ్ తగ్గడానికి విశ్లేషకులు కొన్ని కారణాలు చెబుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో పాటు ఎలక్ట్రానిక్ మ్యూజిక్, డీజే మిక్స్ తరహా పాటలకు యువత అలవాటు పడటం. దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి సంగీత దర్శకుల రాకతో అగ్ర హీరోల సినిమాలు మణిశర్మకు దూరం కావడం. మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ హిట్ ఇచ్చినా, దానిని నిలబెట్టుకునే స్థాయిలో ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడం వంటివీ ఆయన ఫేడ్ అవ్వడానికి కారణం అయ్యాయి.

Read also-‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చింది.. హరీష్ శంకర్ చెప్పింది ఇదే..

‘చెన్నై లవ్ స్టోరీ’తో మళ్ళీ ఫామ్‌లోకి?

తాజాగా ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు తనపై నమ్మకంతో మళ్ళీ పాత మణిశర్మను గుర్తుకు తెచ్చేలా అవుట్‌పుట్ తీసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ ఎన్నోసార్లు తనను తాను నిరూపించుకున్న మణిశర్మ, ఈ సినిమాతో మళ్ళీ బిజీ అవుతారని, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×