E-Paper
Advertisement

Manoj and Mounika: మూడేళ్ల వివాహ బంధం.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

Manoj and Mounika: మూడేళ్ల వివాహ బంధం.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా?
Advertisement

Manoj and Mounika: మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy).. తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని (మార్చి 3) గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారి వివాహ వార్షికోత్సవ (Wedding Anniversary) వేడుకలు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ మూడు సంవత్సరాల వైవాహిక బంధంలో మనోజ్ – మౌనిక కుటుంబం ఏ విధంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వారి వివాహం అనంతరం జీవితంలోని ప్రతి విషయాన్ని వారు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. కుమారుడు ధైరవ్‌తో పాటు 2 ఏప్రిల్, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారిందని చెప్పవచ్చు. అటు మంచు మనోజ్ వృత్తిపరంగా.. వివాహం తర్వాత అతనికి బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ‘భైరవం’, ‘మిరాయ్’ అంటూ వరుసగా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మనోజ్ అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్, మాస్ అప్పీల్‌ను ఈ సినిమాలు తెలియజేశాయి. ప్రేక్షకుల్లో మనోజ్‌కి ఉన్న చెరగని ప్రేమకు, అభిమానానికి ఈ చిత్రాలకు లభించిన ఆదరణే నిదర్శనం.

Also Read- Allu Arjun -Virosh: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్.. బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్.. తగ్గేదే లేదంటూ

పెళ్లి తర్వాత ఇద్దరి జర్నీ సక్సెస్ ఫుల్‌గా..

Advertisement

ఇదే ఊపులో ఆయన ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇది ఇప్పటికే భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. ఇంకా మరిన్ని ప్రాజెక్టుల్ని మనోజ్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఇక సినిమాలే కాకుండా మనోజ్ గత ఏడాది నవంబర్‌లో మోహన రాగ మ్యూజిక్‌ను ప్రారంభించారు. కొత్త వారిని, నూతన ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రపంచ వేదికపై తెలుగు సంగీతాన్ని గౌరవించడానికి అంకితంగా ఇది మారనుంది. మరోవైపు మౌనిక కూడా తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ ఫౌండర్, సీఈవోగా స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా రిటైల్ స్టోర్‌లలో 75 వేల యూనిట్లకు పైగా విక్రయించారు. నమస్తే వరల్డ్‌ని ఆమె కేవలం ఒక వ్యాపారంగా చూడటం లేదు. భారతదేశంలో తయారు చేసిన, సాంస్కృతికంగా పెనవేసుకున్న బొమ్మలను ప్రతి పిల్లల చేతుల్లోకి చేర్చాలని ఆమె ఎంతగానో తపిస్తున్నారు.

Also Read- Buchi Babu Sana: ‘రై రై రా రా’ పాట చేస్తున్నప్పుడు చరణ్‌కు ‘హై ఫీవర్’.. అయినా సరే!

నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

Advertisement

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనోజ్, మౌనిక జంటకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్.. అభిమానులు వారిపై చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వీరిద్దరి రాజకీయ ఎంట్రీ కోసం అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎవరు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో, వారి నెక్ట్స్ స్టెప్ ఏంటనేది కాలమే నిర్ణయించనుంది. ఇటీవల వారు రాజకీయాలపై దృష్టి పెట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వారిద్దరూ ఈ స్టేజ్‌కు చేరుకోవడానికి ఎన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారనే విషయం అందరికీ తెలుసు. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. కింది స్థాయి నుంచి జీవితాన్ని మొదలు పెట్టి ఇప్పుడు అందరూ మెచ్చుకునే స్థాయి వరకు వచ్చారు. ఇతరులకు సాయమందించడం, సేవలో చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక వారు వేసే నెక్ట్స్ స్టెప్‌తో ప్రజలతో మరింత మమేకం అవుతారని వారి శ్రేయోభిలాషులు, అభిమానులు భావిస్తూ.. వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read- Sathi Leelavathi:వాయిదా పడిన మెగా కోడలు సతి లీలావతి .. మళ్లీ విడుదల ఎప్పుడంటే?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×