E-Paper
Advertisement

ట్రెడిషనల్ లుక్‌లో మిస్ వరల్డ్ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో!

ట్రెడిషనల్ లుక్‌లో మిస్ వరల్డ్ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో!
Advertisement

Manushi Chhillar:మానుషి చిల్లర్…ఈ మిస్ వరల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందంతో పాటు తనదైన స్టైల్‌తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న ఈ ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఫ్యాషన్, ఫొటోషూట్స్, సినిమా అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు తన అభిమానులకు అలరిస్తూనే ఉంటుంది .

ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు సంబంధించిన ఈ ఫొటో ఇప్పుడు ఫ్యాషన్ లవర్స్ కి మంచి కిక్కిస్తుంది. పర్పుల్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపిస్తున్న మానుషి చిల్లర్ తన లుక్‌తో ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.ఈ ఫొటోలో మానుషి చిల్లర్ ధరించిన పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌కు గోల్డెన్ ఎంబ్రాయిడరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

Advertisement

ముఖ్యంగా డ్రెస్‌పై ఉన్న డిజైన్లు, వాటికి సరిపోయే గోల్డ్ కలర్ ఇయర్‌రింగ్స్ ఆమె లుక్‌కు మరింత పెంచాయనే చెప్పాలి. ఇక సింపుల్ మేకప్, ఆకట్టుకునే హెయిర్‌స్టైల్‌తో కనిపిస్తున్న ఈ బ్యూటీ ట్రెడిషనల్ వేర్‌లోనూ ఎంత స్టైలిష్‌గా కనిపించవచ్చో మరోసారి ప్రూవ్ చేసింది.

మానుషి చిల్లర్ కెరీర్ విషయానికి వస్తే 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇంటర్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది.ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్షయ్ కుమార్ కి జోడీగా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ చిత్రంలో సంయోగిత పాత్రలో కనిపించింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్ కి మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.

Advertisement

ఆ తర్వాత విక్కీ కౌశల్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ సినిమాలో నటించిన మానుషి 2024లో విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మానుషి అహ్నా గిల్ పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా బోల్తా కొట్టడం తో మళ్ళీ తెలుగులో కనిపించలేదు.అదే ఏడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమాలోనూ 2025లో విడుదలైన ‘మాలిక్’, ‘టెహ్రాన్’ సినిమాలలోనూ నటించి మెప్పించింది.

ఇక సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోలపైనా ఆసక్తి చూపించే మానుషి దిల్జీత్ దోసాంజ్‌తో చేసిన ‘కుఫర్’ మ్యూజిక్ వీడియో చేసి మరింత పాపులర్ అయింది.ఇక హిమేష్ రేషమ్మియాతో కలిసి ‘షరాబ్’లోనూ కనిపించింది కూడా

మొత్తానికి, అందం, ఫ్యాషన్, సినిమాలు..అంటూ అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తున్న మానుషి చిల్లర్ తాజాగా పెట్టిన పర్పుల్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ పోస్ట్ తో అభిమానులని ఫిదా చేస్తుంది అనడంలో సందేహం లేదు !

Tags

Related News

అసలు ‘ఎంద చేట’ ఎలా పుట్టిందో తెలుసా? కృష్ణారెడ్డి చెప్పిన అసలు కథ!

పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తప్పు మాదే: సాయి ధరమ్ తేజ్

రవితేజ తల్లిగా దివ్యవాణి.. చివరికి ఏమైందంటే!

ఘరానా మొగుడు ఛాన్స్ మిస్.. అసలు కారణం చెప్పిన దివ్యవాణి!

నా బెడ్ రూమ్ లో దెయ్యాలున్నాయి…షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన హీరో!

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?

Big Stories

Advertisement
×