Kissik Talks:బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం కిస్సిక్ టాక్స్. వర్ష యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాం నుండి తాజాగా ప్రోమో రిలీజ్ అయింది.ఇక ఈ ఎపిసోడ్ లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి పాల్గొనడం విశేషం.ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత కావాలనే బయటికి వచ్చేశానంటూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
ఎలిమినేషన్ కాదు.. నేనే బయటకు వచ్చేశా!
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన కొద్ది సమయంలోనే బయటకు రావడం వెనుక ఏం జరిగిందనే ప్రశ్నకు మిథిలేష్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. తాను ఎలిమినేట్ కాలేదని, కావాలనే బయటకు వచ్చేశానని స్పష్టం చేశారు. సాధారణంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ సమయంలో ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా హౌస్ నుండి బయటికి వస్తారన్న సంగతి తెల్సిందే. అయితే మిథిలేష్ అలా నేను ఎలిమినేషన్ కాలేదని, వాక్అవుట్ చేసి బయటికి వచ్చానని చెప్పడం విశేషం.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ప్రశ్నకి సమాధానంగా బిగ్‌బాస్ తనను టెన్షన్ పెట్టాలని చూస్తే.. తాను కూడా బిగ్‌బాస్‌కు టెన్షన్ పెట్టేలా ఉంటానని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు.
కామనర్స్‌కు కూడా రెమ్యునరేషన్ ఉంటుందా?
ఈ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకి పారితోషికం ఉంటుందా అనే ప్రశ్నకి జవాబుగా కామనర్స్‌కు కూడా ఒక అమౌంట్ అనేది ఉంటుందని, విజేతగా నిలిస్తేనే డబ్బులు వస్తాయనే అభిప్రాయం సరైంది కాదని ఆయన వివరించారు. ఎన్ని వారాలు హౌస్‌లో కొనసాగితే, దానికి తగ్గట్టుగా పారితోషికం లభిస్తుందనే విషయాన్నితెలిపారు.
కామనర్సా.. సెలబ్రిటీలనా? అసలు పోటీ ఎవరితో?
కామనర్సా.. సెలబ్రిటీలనా? ఈ అంశంపై మిథిలేష్ మాట్లాడుతూ.. కామనర్స్‌ను ప్రేక్షకులు తమలో ఒకరిగా భావించే అవకాశం ఉంటుందని సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తులు అనే తేడాతో కాకుండా ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవుతారనేదే ముఖ్యమని తెలిపారు.
విజేత ఎవరు? మిథిలేష్ అంచనాలు నిజమవుతాయా?
బిగ్‌బాస్ విజేత గురించి అడిగిన ప్రశ్నకు కూడా మిథిలేష్ ఆన్సర్ ఇస్తూ వచ్చే వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని, తన అంచనా ప్రకారం ఇద్దరు కామనర్స్ హౌస్ నుండి బయటికి రావొచ్చని చెప్పారు.తాను చెప్పిన అంచనాలు నిజమైతే ‘బిగ్‌బాస్ జ్యోతిష్యం’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తానంటూ కామెడీ చేశాడు.
బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్స్ నిజమేనా?
అప్లికేషన్ ఫామ్‌లో రిలేషన్షిప్ స్టేటస్, ప్రస్తుతం కమిటెడ్‌గా ఉన్నారా లేదా, భవిష్యత్తులో సంబంధాలకు అవకాశం ఉందా వంటి ప్రశ్నలు ఉంటాయని చెప్పుకొచ్చాడు మిథిలేష్.మొత్తానికి, బిగ్‌బాస్‌లో తన అనుభవాలు, పారితోషికం, కామనర్స్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ , విజేతపై అంచనాలు, వంటి అంశాలపై మిథిలేష్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఇంటర్వ్యూలోని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆదివారం 8 గంటలకి బిగ్ టీవీలో టెలీకాస్ట్ కానున్న ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే!
ALSO READ :బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!