E-Paper
Advertisement

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!
Advertisement

Young India Institutes: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ లో నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 29 యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒక్కో చోట ఐదుగురు..

ప్రస్తుత విద్యాసంవత్సరం(2026-27) నుంచే ఈ ఇన్‌స్టిట్యూట్లు అందుబాటులోకి రానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి మినహా మిగిలిన 29 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అర్హులైన, అనుభవజ్ఞులైన గెస్ట్ ఫ్యాకల్టీని గంటల ప్రాతిపదికన 152 పనిదినాల కోసం నియమించనున్నారు. 20 ఐఐటీ-జేఈఈ, నీట్ కేంద్రాల్లో ఒక్కో చోట ఆరుగురు చొప్పున, 9 క్లాట్ కేంద్రాల్లో ఒక్కో చోట ఐదుగురు చొప్పున ఫ్యాకల్టీ సభ్యులు విధుల్లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు విద్యార్థులకు కాన్సెప్ట్ ఆధారిత బోధన, మోక్ టెస్టులు, అసైన్‌మెంట్లు, సందేహాల నివృత్తి సెషన్లను నిర్వహిస్తారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు అనుగుణంగా పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను కూడా ఉచితంగా అందజేస్తారు.

రూ. 3.73 కోట్లు విడుదల..

Advertisement

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ అమలు కోసం ప్రభుత్వం రూ. 3.73 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఎక్స్‌టర్నల్ గెస్ట్ ఫ్యాకల్టీ రెమ్యునరేషన్ కోసం రూ. 3.26 కోట్లు, విద్యార్థుల స్టడీ మెటీరియల్ కొనుగోలు కోసం రూ. 47.04 లక్షలు కేటాయించారు. ఈ నిర్ణయం ద్వారా 29 కేంద్రాల్లోని మొత్తం 3,920 మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కాగా ఈ కార్యక్రమం సజావుగా సాగేలా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి శిక్షణ అందించి, ఉన్నత విద్యావకాశాలను మెరుగుపరచడమే ఈ యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

Also read: పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో తప్పు మాదే: సాయి ధరమ్ తేజ్

Tags

Related News

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అప్పీల్.. ఏంటంటే?

సింగరేణిని ముంచింది బీఆర్‌ఎస్సే.. మంత్రి పొంగులేటి సంచలన విమర్శలు!

సీఎంఓ నుంచి బెదిరింపులు.. ప్రతి పనికి 15 శాతం కమీషన్.. కవిత సంచలన ఆరోపణలు!

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల డేటా విడుదల.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!

రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

Big Stories

Advertisement
×