E-Paper
Advertisement

The Raja Saab: అప్పుడే డిసైడ్ అవ్వొద్దు… రాజాసాబ్‌పై మారుతి హోప్స్

The Raja Saab: అప్పుడే డిసైడ్ అవ్వొద్దు… రాజాసాబ్‌పై మారుతి హోప్స్
Advertisement

The Raja Saab: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ది రాజా సాబ్. హర్రర్ కామెడీ, పాట శ్రీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి. చివరికి ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమాని పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు దర్శకుడు మారుతి (Maruthi)పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాలేదు..

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర నిర్మాతలు దర్శకుడు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలోనే సినిమా గురించి వస్తున్న విమర్శల పట్ల స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు మారుతి(Maruthi) మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ముందుగా విమల్ థియేటర్ వద్ద మీడియా వారు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేస్తూ మీడియా వారికి మారుతీ క్షమాపణలు చెప్పారు. అలాగే ది రాజా సాబ్ సినిమా విషయంలో ప్రభాస్(Prabhas) అభిమానులు డిసప్పాయింట్ అవ్వలేదని, వాళ్ళు ఈ సినిమా విషయంలో సాటిస్ఫై కాలేదని మారుతి తెలిపారు.

ఒక్కరోజులోనే డిసైడ్ అవ్వద్దు..

Advertisement

ఈ సినిమా గురించి మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో మారుతీ స్పందిస్తూ ఈ సినిమాని చూసి ఒక్క రోజులోనే రిజల్ట్ డిసైడ్ చేయొద్దని తెలిపారు. ఒక కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఆ పాయింట్ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా ఒక పది రోజులపాటు ఆగండి.. సంక్రాంతికి వరుస సినిమాలు విడుదలవుతున్నాయి ఆయా సినిమా రిసల్ట్ ను బట్టి మా సినిమా రిజల్ట్ కూడా మారుతుందని అందుకే కొద్ది రోజులు ఆగండి అంటూ ఈ సందర్భంగా సినిమా గురించి వస్తున్నటువంటి కామెంట్లపై స్పందిస్తూ సమాధానం చెప్పారు.

మైండ్ గేమ్ మూవీ..

Advertisement

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలాంటి మైండ్ గేమ్స్ తో స్టార్ హీరోల సినిమాలు రాలేదనీ ఈరోజు ప్రేక్షకుల నుంచి ఈ మాట బయటకు వచ్చిందని అందుకే రిజల్ట్ అప్పుడే డిసైడ్ అవ్వద్దు అంటూ మారుతి చెప్పడంతో ఈ సినిమాపై ఆయనకు ఇంకా ఎక్కడో ఆశ ఉందని స్పష్టమవుతుంది .ఇక ఈ సినిమాలో నేటి నుంచి కట్ చేసిన నాలుగు నిమిషాల సన్నివేశాన్ని జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో ప్రభాస్ ఓల్డ్ గెటప్ కు సంబంధించిన సన్నివేశాన్ని జత చేసినట్లు తెలుస్తోంది.. ఈరోజు సాయంత్రం నుంచి ప్రసారం కాబోయే షోలలో ఈ కట్ చేసిన సన్నివేశాలతో ప్రసారం కానుంది. మరి మారుతి చెప్పిన విధంగానే ఈ రెండు రోజులలో రాజాసాబ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో వేచి చూడాలి.

Also Read: Dandora OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శివాజీ దండోరా…స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×