E-Paper
Advertisement

Odi Matches: వన్డే క్రికెట్ టైమింగ్స్ చేంజ్.. ఇకపై 11:30 AM మ్యాచ్ స్టార్ట్?

Odi Matches: వన్డే క్రికెట్ టైమింగ్స్ చేంజ్.. ఇకపై 11:30 AM మ్యాచ్ స్టార్ట్?
Advertisement

Odi Matches: భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య బుధవారం రోజు రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే దక్షిణాఫ్రికా జట్టు 49.2 ఓవర్లలోనే ఈ భారీ లక్ష్యాన్ని చేదించింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1 – 1 తో సమంగా ఉంది.

Also Read: Eng Vs Aus: ఆస్ట్రేలియా కొంపముంచిన Ms ధోని… వికెట్ సమర్పించుకున్న స్మిత్

Advertisement

ఈ క్రమంలో శనివారం రోజు విశాఖపట్నంలో జరగనున్న మూడవ వన్డే సిరీస్ ని డిసైడ్ చేయనుంది. అయితే ఈ ఓటమికి టాస్ కోల్పోవడమే ప్రధాన కారణం అని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కే.ఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం బౌలర్లకు తీవ్ర ఇబ్బందులను సృష్టించిందని వివరించాడు. బంతి తడిగా మారడంతో దానిపై పట్టు సాధించడం, స్పిన్ తిప్పేందుకు బౌలర్లు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు.

 

టీమిండియా అసిస్టెంట్ కోచ్ కీలక వ్యాఖ్యలు:

Advertisement

శనివారం రోజు విశాఖపట్నం వేదికగా జరగనున్న డిసైడర్ మ్యాచ్ కి ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోశాటే కీలక వ్యాఖ్యలు చేశాడు. డ్యూ ప్రభావం, ఐసీసీ నూతన నిబంధనలు, బ్యాటింగ్ స్ట్రాటజీలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. డ్యూ మ్యాచ్ ఫలితం పై ఎటువంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నకు స్పష్టమైన అంచనాలు తెలియజేశాడు. “మంచు మ్యాచ్ ఫలితం పై 10 నుండి 20% వరకు ప్రభావం చూపుతుంది. ఇది చాలా పెద్ద తేడా. ఇటీవల కాలంలో వరుసగా భారత్ 20 సార్లు టాస్ ఓడిపోవడం కూడా ఆశ్చర్యకరం. అయితే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలుస్తుందనే నమ్మకం ఉంది. డ్యూ పరిస్థితులలో బౌలర్లు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. వైట్ బాల్ తో ప్రాక్టీస్ చేయిస్తున్నాము. డ్యూ ఉన్నప్పుడు ఎలా బౌలింగ్ చేయాలి, డిఫెండ్ చేయడానికి ఏ లైన్ అండ్ లెంగ్త్ బెస్ట్ అనేది ట్రై చేస్తూనే ఉన్నాం”. అని చెప్పుకొచ్చాడు.

 

ఐసీసీ నిబంధనలపై అసంతృప్తి:

ఐసీసీ తీసుకు వచ్చిన కొత్త నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ర్యాన్. ఐసీసీ తాజాగా వన్డేలలో రెండు కొత్త బంతుల్లో ఒకదానిని చివరి 16 ఓవర్లలో మాత్రమే ఉపయోగించుకునే నియమాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ర్యాన్ స్పందిస్తూ.. ” హార్డ్ బంతి వల్ల బ్యాటర్ కి వచ్చే అదనపు ప్రయోజనం తగ్గించడానికే ఈ రూల్. కానీ డ్యూ ఉండడం వల్ల బంతి మరింత తడి అవుతుంది. ఇది మరొక రకమైన సవాల్. డ్యూ ఉన్నప్పుడు మొదట బ్యాటింగ్ చేసే జట్టు ఎక్కువగా స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది.

Also Read: Eng vs Aus 2nd Test: మీ దుంపలు తెగ.. గ్రౌండ్ లోనే రొమాన్స్ చేస్తున్నారు కదరా!

ఇక మధ్యాహ్నం ఒకటి తరువాత లేదా రెండు గంటల తర్వాత ఇండియాలో వన్డే మ్యాచ్ లు నిర్వహిస్తే.. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్లకు ఇబ్బంది అవుతుంది. మంచు కారణంగా సెకండ్ బౌలింగ్ చేసిన వాళ్లకు బంతి గ్రిప్ దొరకడం లేదు. అందువల్ల మన టీం ఇండియా ఓడిపోయింది. అందుకే ఉదయం 11:30 గంటలకే మ్యాచ్ ప్రారంభమైతే వన్డేలు త్వరగా పూర్తవుతాయి. అప్పుడు మంచు ప్రభావం ఉండదు”. అని చెప్పుకొచ్చాడు.

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×