E-Paper
Advertisement

‘Mega 158’ క్రేజీ అప్‌డేట్.. పొల్లాచిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ చిత్రం

‘Mega 158’ క్రేజీ అప్‌డేట్.. పొల్లాచిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ చిత్రం
Advertisement

Mega 158 Update: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘Mega 158’ (చిరు-బాబీ 2) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ చిత్రం, తాజాగా తన మొదటి కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తమిళనాడులోని అందమైన లొకేషన్ ‘పొల్లాచి’ పరిసర ప్రాంతాలలో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్‌ను చిత్ర బృందం ముగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Read also-జాన్వీ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. ఆ ఒక్కటి తగ్గిస్తే బెటర్..

బాక్సాఫీస్ వద్ద ‘బ్లడీ బెంచ్‌మార్క్’..

Advertisement

షెడ్యూల్ ముగింపుపై స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రత్యేక నోట్ విడుదల చేసింది. “పొల్లాచి షెడ్యూల్ పూర్తయింది. ప్రధాన నటీనటులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ ‘చిరు-బాబీ 2’ టీమ్ ఈ హై-ఎనర్జీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. బాక్సాఫీస్ వద్ద ఒక ‘బ్లడీ బెంచ్‌మార్క్’ (Bloody Benchmark) సెట్ చేయడానికి టీమ్ అంతా కసితో సిద్ధంగా ఉంది” అని మేకర్స్ పేర్కొన్నారు.

సెట్స్‌లో మెరిసిన తారాగణం

పొల్లాచి సెట్స్ నుండి విడుదలైన ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మలయాళ యువ నటి అనస్వర రాజన్, టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ కనిపించారు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అనస్వర రాజన్ చిరంజీవి కూతురి పాత్రలో నటిస్తున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. అలాగే రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నటిస్తున్న కన్నడ బ్యూటీ రచితా రామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్ర కోసం హనీ రోజ్‌ను అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి రచితా రామ్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్.

Advertisement

Read also-రాజకీయ అరంగేట్రంపై రాఘవ లారెన్స్ సంచలన నిర్ణయం.. ‘నా నిర్ణయం మీ చేతుల్లోనే’ అంటూ..

మళ్లీ మ్యాజిక్ రిపీట్ కానుందా?

గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో నిలిచి ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రెండో ప్రాజెక్ట్‌ను కూడా అంతకు మించిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో, బలమైన సిస్టర్/డాటర్ ఎమోషన్స్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాబీ మలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలకు సిద్ధమవుతుండగా, సమాంతరంగా ఈ ‘Mega 158’ షూటింగ్‌ను కూడా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు మరో ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.

Related News

హీరోయిన్ హెబ్బా పటేల్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

హీరోయిన్లకు ఉన్న ఈ వింత అలవాట్లు తెలిస్తే షాక్ అవుతారు!

సినిమా పైరసీకి కేంద్రం షాక్.. వేల వెబ్‌సైట్లు బ్లాక్!

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!

బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?

మన చదువుల పీక కోసేస్తున్న AI.. ఆర్జీవీ సంచలనం!

Big Stories

Advertisement
×