E-Paper
Advertisement

గోడలపై తేమకు కారణం లీకేజీనా? కండెన్సేషనా? అల్యూమినియం ఫాయిల్‌తో ఇలా కనిపెట్టండి!

గోడలపై తేమకు కారణం లీకేజీనా? కండెన్సేషనా? అల్యూమినియం ఫాయిల్‌తో ఇలా కనిపెట్టండి!
Advertisement

Aluminum Foil Hack: ఇంటి గోడలపై అప్పుడప్పుడు నల్లటి మచ్చలు లేదా తేమ కనిపిస్తూ ఉంటుంది. ఇది వంట గదిలోని స్టీమ్ వల్ల వచ్చిందా లేక గోడ వెనుక పైపుల నుండి నీరు లీక్ అవుతుందా అనేది తేల్చుకోవడం కష్టం. అయితే, ఆర్కిటెక్ట్‌లు, బిల్డింగ్ నిపుణులు దీనికోసం ఒక సులువైన చిట్కాను చెబుతున్నారు. కేవలం ఒక అల్యూమినియం ఫాయిల్ ముక్కతో 24 నుండి 48 గంటల్లో ఈ సమస్యకు గల అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో చూసేద్దాం రండి..

ఒక చిన్న సైన్స్ చిట్కా:

చామర్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల ప్రకారం.. గోడల్లోని తేమను గుర్తించడానికి అల్యూమినియం ఫాయిల్ ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. తేమ ఉన్న చోట ఈ ఫాయిల్‌ను అంటించడం ద్వారా అక్కడ గాలి చొరబడకుండా, నీరు ఆవిరి కాకుండా ఆగిపోతుంది. దీనివల్ల నీటి చుక్కలు ఎటువైపు నుండి వస్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఖరీదైన టూల్స్ వాడే ముందు ఇదొక మంచి ప్రాథమిక పరీక్ష.

ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి?

Advertisement

గోడపై ఉన్న తేమ ఉన్న చోట 12 ఇంచుల అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని, నాలుగు వైపులా గాలి వెళ్లకుండా గట్టిగా టేప్ వేయాలి. రెండు రోజుల తర్వాత దానిని తీసి పరిశీలించాలి. ఒకవేళ ఫాయిల్ లోపలి వైపు (గోడకు అంటుకుని ఉన్న వైపు) తేమ ఉంటే.. గోడ లోపల లీకేజీ ఉందని అర్థం. అదే ఫాయిల్ బయటి వైపు (గది వైపు) తడిగా ఉంటే, అది గదిలోని హ్యుమిడిటీ లేదా కాండెన్సేషన్ వల్ల వచ్చిన తేమ అని గుర్తించవచ్చు. కొన్నిసార్లు తెల్లటి పౌడర్ లాంటి పదార్థం (ఎఫ్లోరోసెన్స్) కనిపిస్తే, గోడల్లోకి నీరు బాగా చేరిందని అర్థం.

Also Read: రూ.5000 డిస్కౌంట్‌తో Xiaomi 17T.. భారీ బ్యాటరీ, లైకా కెమెరాలతో అదరగొడుతోంది!

గదిలోని తేమ సమస్య అయితే..

Advertisement

ఫాయిల్ బయటి వైపు తడిగా ఉంటే.. అది గదిలో గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. వంట చేసినప్పుడు లేదా స్నానం చేసినప్పుడు వచ్చే స్టీమ్ గోడలపై చేరి ఇలా మారుతుంది. దీనికోసం కిచెన్, బాత్‌రూమ్‌లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడాలి. ఇంట్లో తేమ శాతాన్ని 30 నుండి 50 లోపు ఉంచుకుంటే గోడలు చెమర్చవు. అప్పుడప్పుడు కిటికీలు తెరవడం, డీహ్యుమిడిఫైయర్ వాడటం వల్ల ఇల్లు పొడిగా మారి కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

గోడ లోపల లీకేజీ ఉంటే..

ఒకవేళ గోడ లోపలి భాగం తడిగా ఉంటే.. అది పైపుల లీకేజీ లేదా వర్షపు నీరు లోపలికి రావడం వల్ల కావచ్చు. ఇలాంటి సమయాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలి. ఎందుకంటే.. తేమ ఉన్న చోట 24 నుండి 48 గంటల్లోనే బూజు (మోల్డ్) పట్టే ప్రమాదం ఉంది. నీటి లీకేజీని అరికడితేనే ఈ సమస్య శాశ్వతంగా పోతుంది.

ఆరోగ్యంపై ప్రభావం:

గోడలపై తేమ కేవలం చూడటానికి అసహ్యంగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), CDC నివేదికల ప్రకారం, తేమ వల్ల పెరిగే బూజు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఇది ఆస్తమా, దగ్గు, అలర్జీలను పెంచుతుంది. అందుకే గోడలపై మచ్చలు కనిపించిన వెంటనే అల్యూమినియం ఫాయిల్ టెక్నిక్‌తో కారణాన్ని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.

Also Read: ఇంత తక్కువ ధరకా? సినిమా హాల్ లాంటి 48W సౌండ్, Google TVతో Blaupunkt QLED TV సంచలనం!

Related News

కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!

రూ. 2,000 కే వాషింగ్ మిషన్.. సైకిల్ పెడల్ తొక్కితే బట్టలు క్లీన్.. ఇదేదో భలే ఉందే!

బెస్ట్ పవర్ బ్యాంక్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

iPhone Duoని పక్కన పెట్టేలా iPhone 18 Proలో ఉన్న 5 కీలక ఫీచర్లు ఇవే!

తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..ట్రెండింగ్‌లో టాప్ గాడ్జెట్

జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!

Airtel గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. అపరిమిత 5G, 18కి పైగా ఓటీటీలు, ఫ్రీ కాల్స్.. 84 రోజులు పండగే!

50 గంటల బ్యాటరీ, శాటిలైట్ కమ్యూనికేషన్.. రూ.1.09 లక్షల ధరతో Apple Watch Ultra 4 లాంచ్!

Big Stories

Advertisement
×