E-Paper
Advertisement

రాజకీయ అరంగేట్రంపై రాఘవ లారెన్స్ సంచలన నిర్ణయం.. ‘నా నిర్ణయం మీ చేతుల్లోనే’ అంటూ..

రాజకీయ అరంగేట్రంపై రాఘవ లారెన్స్ సంచలన నిర్ణయం.. ‘నా నిర్ణయం మీ చేతుల్లోనే’ అంటూ..
Advertisement

Lawrence Political Entry: ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ మరియు సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది. తాను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనే విషయాన్ని ప్రజలే తేల్చాలంటూ ఆయన ఓపెన్ పోల్ పెట్టడం విశేషం. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తమిళనాడులోని ‘తిరుచ్చి ఈస్ట్’ (Trichy East) నియోజకవర్గం నుండి పోటీ చేయడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Read also-Ennenno Janmala Bandham : ‘ఎన్నెన్నో జన్మల బంధం ‘ వేద మళ్ళీ వచ్చేస్తుంది.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

Advertisement

వీడియోలో లారెన్స్ మాట్లాడుతూ.. తన 22 ఏళ్ల సామాజిక సేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, భగవద్గీతలోని “కర్మ చేయి.. ఫలితాన్ని ఆశించకు” అనే శ్లోకాన్ని ప్రస్తావించారు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసేవాడికే భగవంతుడు గొప్ప స్థానాన్ని ఇస్తాడని, తాను కూడా అదే నమ్మి ఇన్నాళ్లూ సేవ చేశానని భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ‘జల్లీకట్టు’ ఉద్యమం సమయంలో పిల్లలకు ఆహారం అందించడానికి వెళ్లినప్పుడు మొదటిసారిగా తనకు రాజకీయ వాతావరణంతో పరిచయం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత తన గురువు, దైవసమానుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పుడు, ఆయనకు మద్దతుగా నిలవాలని లారెన్స్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే, ఆరోగ్య కారణాల రీత్యా రజనీకాంత్ రాజకీయాల నుండి తప్పుకోవడంతో లారెన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

లారెన్స్ రాజకీయ నిర్ణయంలో ఆయన తల్లి పాత్ర చాలా కీలకంగా మారింది. తాను రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు తన తల్లి (కణ్మణి) తీవ్రంగా వ్యతిరేకించారని లారెన్స్ గుర్తు చేసుకున్నారు. “రాజకీయాలు ఒక మురికికూపం. అక్కడ డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తారు. కులం, మతం రాజకీయాలను శాసిస్తాయి. నువ్వు చాలా సాఫ్ట్, నీకు ఆ బురద సెట్ అవ్వదు. నీకున్న డబ్బుతోనే సేవ చేసుకో, రాజకీయాలు వద్దు” అని ఆమె గట్టిగా వారించడంతో, తల్లి మాటను జవదాటలేక అప్పట్లో ఆయన తన ఆలోచనను పక్కన పెట్టారు.

Advertisement

అయితే, ఆయన అత్యంత ఆప్తమిత్రుడు, దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లారెన్స్ జీవితంలో పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఇటీవలి ఎన్నికల్లో విజయ్ ఎటువంటి డబ్బు, కుల రాజకీయాల ప్రలోభాలు లేకుండా, కేవలం ప్రజల నమ్మకంతో భారీ విజయాన్ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ సాధించిన ఈ క్లీన్ విక్టరీని చూసి లారెన్స్ తల్లి మనసు పూర్తిగా మారిపోయింది. ఒక మంచి వ్యక్తి మార్పు తీసుకురావాలని అనుకుంటే ఈ సమాజంలో సాధ్యమవుతుందని విజయ్ నిరూపించాడని, నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్ళవచ్చని ఆమె లారెన్స్‌కు పచ్చజెండా ఊపారు.

Read also-‘సింగ్-గీతం’ మూవీ రివ్యూ.. సింగీతం గారి ‘సంగీత’ ప్రయోగం ఎలా ఉందో తెలియాలంటే?

అమ్మ అనుమతి లభించడంతో తాను రాజకీయ క్షేత్రంలోకి దూకేందుకు మానసికంగా సిద్ధమయ్యానని లారెన్స్ ప్రకటించారు. అయితే, ఎన్నో ఏళ్లుగా నటుడిగా, సేవకుడిగా తనను ఆదరించిన ప్రజల అభిప్రాయం తనకు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. “నేను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? ఆ అర్హత నాకు ఉందా లేదా? అనేది ప్రజలే నిర్ణయించాలి. మీ తీర్పు కోసమే నేను వేచి చూస్తున్నాను” అంటూ లారెన్స్ ప్రజలను కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. ఒకవేళ ప్రజల నుండి సానుకూల స్పందన వస్తే, రాఘవ లారెన్స్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి లారెన్స్ రాజకీయ ఎంట్రీపై జనం ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి!

Related News

హీరోయిన్లకు ఉన్న ఈ వింత అలవాట్లు తెలిస్తే షాక్ అవుతారు!

సినిమా పైరసీకి కేంద్రం షాక్.. వేల వెబ్‌సైట్లు బ్లాక్!

ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!

బాలయ్య బాబు ఆసుపత్రిలో.. కొరటాల సెట్‌లో..జోరుమీదున్న NBK 112

ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?

మన చదువుల పీక కోసేస్తున్న AI.. ఆర్జీవీ సంచలనం!

జయకృష్ణ ఎంట్రీకి ఫుల్ జోష్.. ‘ఉక్కిరి బిక్కిరి’ సాంగ్ వైరల్!

“అసలు వీళ్లని ఎవరు కంటున్నారో.. ?” యువతపై ఫైర్ అయిన బాలీవుడ్ క్వీన్!

Big Stories

Advertisement
×