E-Paper
Advertisement

Mega Family Sankranti : మెగా ఇంట సంక్రాంతి సంబరాలు… ఒకేచోట మెగా హీరోల సందడి!

Mega Family Sankranti : మెగా ఇంట సంక్రాంతి సంబరాలు… ఒకేచోట మెగా హీరోల సందడి!
Advertisement

Mega family Sankranti: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే మెగా కుటుంబంలో ఏ చిన్న వేడుక జరిగినా అందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇలా ప్రతి ఏడాది పండుగలను మెగా కుటుంబ సభ్యులు ఇలాగే ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ పండుగ మొత్తం మెగా ఇంట్లోనే ఉంటుందని చెప్పాలి అందరూ ఒకే చోట చేరి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

స్పెషల్ అట్రాక్షన్ గా మెగా కోడళ్ళు..

ఇక ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా మెగా హీరోలు అందరూ సరదాగా దోశలు వేస్తూ సందడి చేశారు. ఇక మెగా కోడళ్ళు కూడా ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా కుటుంబ సభ్యులందరూ ఒకే చోటచేరి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి సెలబ్రేషన్స్ కు దూరంగా అల్లు కుటుంబం..

Advertisement

ఇక గతంలో మెగా కుటుంబంతోపాటు అల్లు కుటుంబం కూడా ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకునే వారు కానీ ఇటీవల ఈ వేడుకలకు అల్లు కుటుంబం కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లో జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా మెగా కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతి మెగా కుటుంబానికి డబుల్ ధమాకా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

?igsh=MWdzZXZldng0MDhqaA%3D%3D

Advertisement

ఇక ఈ సినిమాకు మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించటం విశేషం. ఇలా ఈ పండుగకు తండ్రీ కూతుర్లు ఇద్దరు సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమా కేవలం రెండు రోజులలోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. చిరంజీవి ఇంట్లోనే చిత్ర బృందం మొత్తం పాల్గొని కేక్ కట్ చేస్తూ ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్ గా నటించారు, వెంకటేష్ కూడా కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Also Read: Anchor Suma: ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కష్టాలను బయటపెట్టిన సుమ!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×