E-Paper
Advertisement

Ola Electric Offers: ఓలా అదిరిపోయే ఆఫర్.. ఆ స్కూటర్ పై ఏకంగా రూ. 50 వేలు తగ్గింపు!

Ola Electric Offers: ఓలా అదిరిపోయే ఆఫర్.. ఆ స్కూటర్ పై ఏకంగా రూ. 50 వేలు తగ్గింపు!
Advertisement

Ola Electric Muhurat Mahotsav Offers: దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ. ఎప్పటికప్పుడు తన మోడల్స్ ను అప్ డేట్ చేస్తూ, వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు, మంచి సేల్స్ సాధించేందుకు తరచుగా అదిరిపోయే ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లను కూడా తీసుకొస్తుంది. తాజాగా మరోసారి ముహూర్త మహోత్సవ ఆఫర్‌ ను అందిస్తోంది. ఫిజికల్ స్టోర్లలో మాత్రమే చెల్లుబాటు అయ్యే అప్‌గ్రేడ్, ఎక్స్ఛేంజ్ ప్రోత్సాహకాలతో సహా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఆఫర్ జస్ట్ రెండు రోజులే!

ఈ స్పెషల్ ఆఫర్ ను సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది. జనవరి 13, 14 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ టైమ్ లో టాప్ స్పెక్ ఓలా S1 ప్రో ప్లస్‌ను రూ. 1.49 లక్షలకే పొందే అవకాశం కల్పిస్తోంది.  ఓలా 4680 భారత్ సెల్ ద్వారా పవర్ అందించే మోడళ్లపై ప్రత్యేక, పరిమిత కాల ధరలను అందిస్తోంది. పరిమిత సంఖ్యలో డిస్కౌంట్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింది ఓలా శక్తి, S1, రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్ X ప్లస్ లైనప్‌ లోని స్కూటర్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను అందిస్తుంది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ముహూర్త ధరల కోసం కచ్చితమైన రోజువారీ టైమ్ స్లాట్లను ప్రకటించింది.

Advertisement

ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం 4680 భారత్ సెల్ ఆధారిత మోడళ్లకు సంబంధించి ప్రత్యేక ధరలను ప్రకటించింది. ఓలా S1 ప్రో ప్లస్ 5.2kWh ఇప్పుడు కేవలం రూ. 1,39,999 అందిస్తుంది. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,90,338గా ఉంది. అటు ఓలా రోడ్‌ స్టర్ ఎక్స్ ప్లస్ 9.1kWh ఇప్పుడు రూ. 1,49,999 లభిస్తుంది. ఈ స్కూటర్ వాస్తవ ధర రూ. 1,89,999గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

అదనపు ప్రయోజనాలను అందిస్తున్న ఓలా

ప్రస్తుత ఓలా కస్టమర్లు రూ. 20,000 అప్‌గ్రేడ్ బోనస్ నుంచి మరింత లాభం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పెట్రోల్-ఆధారిత వాహనాల నుంచి మారే కస్టమర్లకు రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ రెండు ప్రయోజనాలు ఫిజికల్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

ముహూర్త సమయాల్లో మాత్రమే ప్రత్యేక ఆఫర్లు

Advertisement

ఈ ప్రత్యేక ఆఫర్లు ముహూర్త సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఓలా బ్రిక్ అండ్  మోర్టార్ స్టోర్లలో ప్రత్యేకంగా పొందవచ్చని వెల్లడించింది. ముహూర్త మహోత్సవ్ తిరిగి రావడంతో, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేస్తూనే దాని అధునాతన బ్యాటరీ సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఈ ఆఫర్ కు వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.

Read Also: మూడు వేరియంట్లు, ఐదు రంగులు.. సుజుకి యాక్సెస్ 125 అదిరింది బ్రో!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×