E-Paper
Advertisement

65W Power Bank: మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్‌కూ ఫాస్ట్ ఛార్జ్.. 65W అప్డేటెడ్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఇవే!

65W Power Bank: మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్‌కూ ఫాస్ట్ ఛార్జ్.. 65W అప్డేటెడ్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

65W Power Bank: ప్రముఖ చైనీస్ టెక్ సంస్థ Anker తమ Prime 65W పవర్ బ్యాంక్‌ను అప్‌డేట్ చేసి తాజాగా మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త మోడల్‌లో పెద్దగా మార్పులు ఏమీ ఉండకపోవచ్చని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే అందుబాటులో ఉన్న త్రీ ఇన్ వన్ పోర్టబుల్ ఛార్జర్ డిజైన్‌ను అలాగే కొనసాగిస్తూ.. ఈసారి అదనంగా ఒక ఫాస్ట్ ఛార్జింగ్ USB-C కేబుల్‌ను కొత్తగా కనెక్ట్ చేయడ వల్ల ఈ 65W పవర్ బ్యాంక్‌‌ను ప్రధాన అప్‌డేట్‌గా చెప్పుకోవచ్చు.

ఈ పవర్ బ్యాంక్‌లో ముందున్నట్లే బిల్ట్ ఇన్ పవర్ అవుట్‌లెట్ ప్రాంగ్స్ ఉన్నాయి. అంటే.. వాల్ సాకెట్‌లో నేరుగా ప్లగ్ చేసి పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేయవచ్చు. కొత్తగా జోడించిన USB-C కేబుల్ ఇంటిగ్రేటెడ్‌గా ఉండదు, కానీ పవర్ బ్యాంక్‌కి ఉన్న లాన్యార్డ్ స్లాట్‌లో దానిని సులభంగా అమర్చుకోవచ్చు. ఈ కేబుల్ పొడవు సుమారు 22 సెం.మీ. ఉండగా.. దీనిలో E-marker చిప్ కూడా ఉంది. దీని వల్ల ఫోన్‌కి మాత్రమే కాకుండా ల్యాప్‌టాప్‌కు కూడా ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతుంది.

Advertisement

Also Read: మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ సౌండ్‌బార్స్.. బడ్జెట్‌లోనే థియేటర్ ఫీల్ 3D ఆడియో

ఇక పోర్ట్‌ల విషయానికి వస్తే.. ఈ అప్డేటెడ్ Anker Prime 65W పవర్ బ్యాంక్‌లో రెండు USB-C పోర్టులు ఉన్నాయి. ఇవి గరిష్టంగా 65W అవుట్‌పుట్ అందిస్తాయి. PD, QC, PPS వంటి ప్రధాన ఛార్జింగ్ స్టాండర్డ్స్‌కు సపోర్ట్ ఉండటం వల్ల, స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను కూడా ఈ పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేయవచ్చు.

Advertisement

కొత్తగా వచ్చిన ఈ పవర్ బ్యాంక్‌లో బ్యాటరీ సామర్థ్యంలో కూడా ఎలాంటి మార్పు లేదు. దీనిలో ఉన్న 10,000mAh బ్యాటరీ వలన సాధారణంగా ఎక్కువ శాతం స్మార్ట్‌ఫోన్లను ఒకటి కంటే ఎక్కువసార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అలాగే, పవర్ బ్యాంక్‌పై ఉన్న బిల్ట్ ఇన్ డిస్‌ప్లే కూడా పాత వెర్షన్ మాదిగానే ఉంటుంది.

65W పవర్ బ్యాంక్‌‌లో మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. దీనిని వాల్ సాకెట్‌లో ఛార్జ్ చేస్తున్నప్పటికీ, రెండు USB-C పోర్టుల ద్వారా ఇతర డివైస్‌లను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చు. ఇలాంటి మల్టీటాస్కింగ్ ఛార్జింగ్ సౌకర్యం వల్ల ప్రయాణాల్లో లేదా ఆఫీస్‌లో మరింత ఉపయోగకరంగా మారుతుంది.

ఇకపోతే.. అప్డేటెడ్‌గా విడుదలైన ఈ 65W పవర్ బ్యాంక్‌‌లో పెద్డగా ఎలాంటి హార్డ్‌వేర్ మార్పులు లేకపోయినప్పటికీ.. కొత్తగా యాడ్ చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్‌తో Anker Prime 65W పవర్ బ్యాంక్ ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన గ్యాడ్జెట్‌గా మారింది.

Alsov Read: పండగ ఆఫర్ అంటే ఇదేనేమో బాసూ.. ఐఫోన్ 17 కొనాలనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

 

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×