E-Paper
Advertisement

SS.Thaman: థమన్ ఇక షెడ్డుకే.. భరించడం కష్టమే

SS.Thaman: థమన్ ఇక షెడ్డుకే.. భరించడం కష్టమే

SS.Thaman: ఒక సినిమాకు ప్రాణం అంటే మ్యూజిక్. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా.. ప్లాప్ అవ్వాలన్నా మ్యూజిక్ మీదనే ఆధారపడి ఉంటుంది. సినిమా హిట్ కాకపోయినా సాంగ్స్ హిట్ అయ్యిన సినిమాలు ఉన్నాయి కానీ, సాంగ్స్ హిట్ కాకుండా హిట్ అయిన సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఒక్కప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ లెక్కలేనంతమంది ఉండేవారు. వారందరికీ ఒక్కో ప్రత్యేకత ఉండేది. క్లాసికల్ కి ఒకరు.. మెలోడీస్ కి మరొకరు.. ఫోక్ కి ఒకరు.. ఆల్ రౌండర్ ఇంకొకరు. అలా సంగీత దర్శకులను తమ సినిమాలకు తగ్గట్లు  డైరెక్టర్లు ఎంచుకొనేవారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మారిపోయింది. ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే.. అందరూ పోలోమని అదే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లడం, సినిమాలు ఒప్పుకున్న ఆ సంగీత దర్శకుడు త్వరత్వరగా చేయాలనే ఆత్రుతతో కాపీ ట్యూన్స్ తీసుకొని.. అటు ఇటు తిప్పి మళ్లీ కొత్త సినిమాకు ఇవ్వడం జరుగుతుంది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ్ భాషలను ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. ఒక కీబోర్టు ప్లేయర్ గా కెరీర్ ను ప్రారంభించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు థమన్.

మొదటినుంచి థమన్ సాంగ్స్ అంటే కాపీ అనే బ్రాండ్ ఉంది. తన సినిమాలోని మ్యూజిక్ ను తానే కాపీ కొట్టి అటుతిప్పి ఇటు తిప్పి ఏదో ఒక కొత్త పాటను తీసుకొచ్చి  ప్రేక్షకుల ముందు పెడతాడు. అది వైరల్ అయితే ఓకే. లేదు అంటే ట్రోల్స్ తప్పవు. ఇండస్ట్రీలో థమన్ కు వచ్చినంత ట్రోలింగ్ ఇంకెవరికి రాలేదు అంటే అతిశయోక్తి కాదు. అయినా కూడా థమన్ సాంగ్స్ నచ్చావా అంటే అందరూ వింటారు. థమన్ ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ హిట్స్ లో కచ్చితంగా బాలయ్య సినిమాలు ఉంటాయి. ఒక అఖండ, వీరసింహారెడ్డి.. ఓజీ,అల  వైకుంఠపురంలో లాంటి సినిమాలు చాలా ఉన్నాయి.

అయితే చూసిన సినిమానే రోజు చూస్తే బోర్ కొట్టక మానదు. ఇప్పుడు థమన్ మ్యూజిక్ కూడా బోర్ కొట్టే స్టేజ్ లోనే ఉంది. ఒకే మ్యూజిక్.. ఎన్నో సాంగ్స్. తీరు మార్చుకోమని ఎన్నోసార్లు.. ఎంతోమంది చెప్పుకొచ్చాహరు. అయినా కూడా థమన్ లో మార్పు లేదు. దానికి ఉదాహరణే ది రాజా సాబ్ ఆల్బమ్. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. రెబల్ సాబ్ అనే సాంగ్ తో  ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. మొదటి సాంగ్.. ఈ సాంగ్ గురించి మేకర్స్ ఇచ్చిన హైప్ అంతా ఇంతాకాదు. ప్రభాస్ – థమన్ అంటే ఓయబ్బో నెక్స్ట్ లెవెల్.. చికిరి చికిరి సాంగ్ ను దాటేస్తుంది అనుకోని చూస్తే ఏం లేదు లోపలంతా డొల్ల అన్నట్ల థమన్ పాత రొట్ట మ్యూజిక్ నే తిప్పి తిప్పి కొట్టాడు.

ప్రభాస్ స్టైల్, డ్యాన్స్, అందం అన్ని ఎంతో బావున్నాయి. ఆ లిరిక్స్ కూడా చాలా బావున్నాయి. మ్యూజిక్ కనుక  మంచిగా పడితే.. రెబల్ సాబ్ సాంగ్ కు తిరుగులేదు అని చెప్పొచ్చు. డార్లింగ్ సాంగ్ ని మధ్యలోనే ఆఫ్ చేసే వెళ్లడం చాలా రేర్. అది ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా థమన్ వలనే. ఎన్నిసార్లు చెప్పినా థమన్ లో మార్పు రాలేదు. దీంతో నెటిజన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఇక నిన్ను భరించడం కష్టమే. షెడ్డుకు పంపించేయాలి అని చెప్పుకొస్తున్నారు. కొత్త కుర్రాడు  సాయి అభ్యంకర్  వయస్సు ఎంత.. ఇండస్ట్రీని అల్లడిస్తున్నాడు. థమన్ ఇలా చేస్తే అలాంటివారిమీదనే డైరెక్టర్స్ డిపెండ్ అవుతారని చెప్పుకొస్తున్నారు.

ప్రస్తుతం థమన్ చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో చిరు – బాబీ సినిమా ఒకటి. రాజా సాబ్ సాంగ్ విన్నాకా ఈ సినిమా నుంచి థమన్ ని తొలగించాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతిసారి కాపీ చేసుకుంటూ.. బోర్ కొట్టే సాంగ్స్ అయితే థమన్ అవసరం లేదని, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఇకనైనా థమన్ తన తీరు మార్చుకుంటాడా అనేది చూడాలి.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×